నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
+మూలాలు, ఆత్మకథ విశేషాలు
పంక్తి 35:
|resting_place=తారామతి బారాదరి, హైదరాబాదు}}
 
'''డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]]''' (1933 [[మార్చి 31]] - 2011 [[జూన్ 7]]) [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నాట్య]] కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ [[బ్రహ్మచారి]]. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు.
 
పదవ శతాబ్దంలోనిశతాబ్దంలో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో, ప్రాచుర్యంలో ఉన్న ''పేరిణి శివతాండవం'' నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం''ను కూడా పునరుద్ధరించాడు.
 
'''[[నటరాజ రామకృష్ణ]]''' 2011, [[జూన్ 7]] న [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
 
== జీవిత విశేషాలు ==
రామకృష్ణ తల్లి దమయంతీ దేవి నల్గొండ జిల్లాకు, తండ్రి రామమోహనరావు తూర్పు గోదావరి జిల్లాకూ చెందినవారు. వీరు [[ఇండోనేషియా]] లోని [[బాలి]] ద్వీపానికి వలస వెళ్ళారు. రామకృష్ణ అక్కడే 1933 [[మార్చి 31]] న జన్మించాడు.<ref name=":0">{{Cite news|title=కూచిపూడి లెజెండ్ నటరాజ రామకృష్ణ పాసెస్ ఎవే|date=7 June 2007|archiveurl=https://web.archive.org/web/20190311055106/https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|archivedate=7 Mar 2011|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|newspaper=ది హిందూ}}</ref> ఆయన చిన్నతనంలోనే తల్లి మరణించింది. నటరాజ రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. రామకృష్ణ నాట్యం నేర్చుకోవడం తండ్రి ఇష్టపడలేదు. "''మా వంశం కళలను పోషించాలే గానీ కళాకారులుగా వాటిని ఆరాధించకూడదని వారి అభిప్రాయం"'' అని తన ఆత్మకథలో రామకృష్ణ రాసుకున్నాడు. తాను రచించిన ''దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర'' పుస్తకానికి లభించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నపుడు కూడా ఆయన సంతోషించలేదని కూడా రాసుకున్నాడు. <ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|last=నటరాజ|first=రామకృష్ణ|publisher=|year=1995|location=హైదరాబాదు|pages=36|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|isbn=}}</ref>
 
==నాట్య ప్రస్థానం==
 
నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి [[నాట్యం]]<nowiki/>కోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''నాయుడుపేట రాజమ్మ'', ''పెండెల సత్యభామ''లు ఉన్నారు. 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు "''నటరాజ"'' అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుండి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.<ref name=":0" />
 
 
 
సినిమా నటుడు [[రమణారెడ్డి (నటుడు)|తిక్కవరపు రమణారెడ్డి]] ఆహ్వానం మేరకు నెల్లూరు వెళ్ళి అక్కడా నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించాడు. తనకు నాగపూరులో మత విద్వేషలు పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా అతడు వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని అనుకోగా, రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|first=రామకృష్ణ|year=1995|location=హైదరాబాదు|pages=31,51|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|series=ప్రథమార్ధం|last=నటరాజ|publisher=|isbn=}}</ref>
Line 56 ⟶ 58:
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ యాభై ఏళ్ళ పాటు నాట్యకళను ముందుకు నడిపించాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయం'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్దండుడు.
 
నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]], పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి.<ref>{{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|year=1992|chapter=పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref> హైదరాబాదులోని [[తారమతి బరాదారి|తారామతి]] మందిరము'','' ప్రేమావతి మందిరాలను ఆయన బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు, ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
 
అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు.
Line 85 ⟶ 87:
#''[[iarchive:in.ernet.dli.2015.391476|అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం]]'' - ఆత్మకథ
#[[iarchive:in.ernet.dli.2015.388363|ఆంధ్రనాట్యం పరిశోధనా గ్రంథం]]
#దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు