"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

→‎కాన్పూరు: ++లక్నో, ఝాన్సీ విభాగాలు
(→‎కాన్పూరు: కొంత అనువాదం)
(→‎కాన్పూరు: ++లక్నో, ఝాన్సీ విభాగాలు)
కొన్ని బ్రిటిషు కథనాల ప్రకారం <ref>J. W. Sherer, ''Daily Life during the Indian Mutiny'', 1858, p. 56.</ref><ref name="AWard">Andrew Ward, ''Our bones are scattered – The Cawnpore massacres and the Indian Mutiny of 1857'', John Murray, 1996.</ref><ref>Ramson, Martin & Ramson, Edward, ''The Indian Empire, 1858''.</ref> బీబీఘర్ మారణకాండకు రెండు వారాల ముందు, అలహాబాదు నుండి వస్తున్న బ్రిటిషు సైన్యం విచక్షణ లేకుండా ప్రజలపై దమనకాండ జరిపింది. ఫతేపూర్‌లో ఒక గుంపు స్థానిక యూరపియన్లపై దాడిచేసి చంపివేసారు. ఆ నెపంతో, బ్రిటిషు కమాండరు నీల్, గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలన్నిటినీ తగలబెట్టి, అక్కడి ప్రజలను ఉరితీయాలని ఆదేశించాడు. నీల్ పద్ధతులు "క్రూరం, దారుణం"<ref>Michael Edwardes, ''Battles of the Indian Mutiny'', Pan, 1963 {{ISBN|0-330-02524-4}}</ref> ఇవి ప్రజలను భయపెట్టకపోగా, అంతకు ముందు తిరుగుబాటులో పాల్గొనని సిపాయీలను కూడా అందుకు పురికొల్పాయి.
 
నీల్ సెప్టెంబరు 26 న లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆనాటి కొందరు బ్రిటిషర్లు నీల్‌ను గొప్పగా కీర్తించారు.<ref>Units of the Army of the Madras Presidency wore blue rather than black shakoes or forage caps.</ref> బ్రిటిషర్లు కాన్పూరును స్వాధీనం చేసుకున్నాక, వాళ్ళుబందీలుగా తమపట్టుకున్న సిపాయి బందీలనుసిపాయీలను బీబీఘర్‌కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన, నేలపైనా ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు.<ref>{{Citation|title=The Victorians at War, 1815–1914: An Encyclopaedia of British Military|first=Harold E.|last=Raugh|year=2004|publisher=[[ABC-CLIO]]|location=[[Santa Barbara, California|Santa Barbara]]|isbn=978-1-57607-925-6|oclc=54778450|page=89}}</ref> కొంత మందిని ఉరితీసారు. మరి కొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేసారు. ఆ సిపాయీలు మారణకాండలో పాల్గొనలేదుగదా అని కొందరు అన్నప్పటికీ, దాన్ని వీళ్ళు ఆపలేదు కదా అని జవాబిచ్చారు. కెప్టెన్ థాంప్సన్ ఈ సంగతిని ధ్రువీకరించాడు.
 
<br />
 
=== లక్నో ===
[[File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|ఎడమ|thumb|The interior of the Secundra Bagh, several months after its storming during the second relief of Lucknow. Albumen silver print by [./https://en.wikipedia.org/wiki/Felice_Beato Felice Beato], 1858]]
మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషానరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.<ref name="HCRE2">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|486}} 90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.
 
ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని ద్ళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.
 
అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.<ref>{{Harvnb|Hibbert|1980|pp=358, 428}}</ref> మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.<ref name="HCRE2" />{{rp|491}}
 
=== ఝాన్సీ ===
ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మారాఠాల పాలనలో ఉన్న సంస్థానం. 1853 లో ఝాన్సీ రాజు కొడుకులు లేకుండా మరణించగా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కింద ఆ రాజ్యాన్ని బ్రిటిషు రాజ్యానికి కలిపేసుకున్నారు. తమ దత్తపుత్రునికి రాఅజ్యాధికారం నిరాకరించడాన్ని రాణి లక్ష్మీబాయి ఎదిరించింది. యుద్ధం మొదలు కాగానే ఝాన్సీ తిరుగుబాటుకు ఒక కేంద్రంగా మారింది. కొందరు కంపెనీ అధికారులు, వారి కుటుంబాలతో సహ ఝాఅన్సీ కోటలో తలదాఅచుకున్నారు. వారి విడుదలకు రాణి లక్ష్మీబాయి అంగీకరించింది. అయితే, విడుదల కాగానే ఈ కంపెనీ వాళ్ళను తిరుగుబాటుదార్లు ఊచకోత కోసారు. ఈ తిరుగుబాటుదార్లతో రాణికి ఏ సంబంధమూ లేదు; ఆమె పదేపదే చెప్పినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటిషర్లను వీడలేదు.
 
1857 అంతానికి బుందేల్‌ఖండ్, తూర్పు రాజస్థాన్‌ ప్రాంతాల్లో చాలావరకు కంపెనీ నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రాంతాల్లోని బెంగాలు సైన్యం కూడా తిరుగుబాటు చేసి, ఢిల్లీ, కాన్పూరుల్లోని యుద్ధాల్లో పాల్గొనేందుకు తరలి పోయింది. ఈ ప్రాంతంలోని అనేక సంస్థానాలు తమలో తాము పోరాడుకోవడం మొదలుపెట్టాయి. 1857 సెప్టెంబరు అక్టోబరుల్లో పొరుగు రాజ్యాల దాడులను రాణి లక్ష్మీ బాయి జయప్రదంగా తిప్పికొట్టింది.
 
1858 మార్చిలో సర్ హ్యూ రోజ్ ఝాన్సీని ముట్టడించాడు. కంపెనీ సైన్యాలు నగరాన్ని ఆక్రమించగా, రాణి మారువేషంలో తప్పించుకుంది.
 
ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సిన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.<ref>Lachmi Bai Rani of Jhansi, the Jeanne d'Arc of India (1901), White, Michael (Michael Alfred Edwin), 1866, New York: J.F. Taylor & Company, 1901.</ref>
 
==తిరుగుబాటు నాయకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2619946" నుండి వెలికితీశారు