[[సంజయుడు]] హిందూ పురాణమైన [[మహాభారతం]]లో ఒక పాత్ర. [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] కొలువులో సలహాదారు మరియు ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు.