పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పరిచయంలో ఒక వాక్యం చేర్పు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right|పరవస్తు చిన్నయసూరి]]
 
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ [[తెలుగు]] రచయిత. గొప్ప, పండితుడు. ఆయన రచించిన [[బాలవ్యాకరణం]], [[నీతిచంద్రిక]] చాలా ప్రసిద్ధి గాంచాయి. ''పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ'' అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|బ్రౌను]] దొర, [[గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి]], జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. [[శబ్దరత్నాకరము|శబ్దరత్నాకర]] కర్త, ప్రౌఢవ్యాకర్తయైన [[బహుజనపల్లి సీతారామాచార్యులు]], ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే. మద్రాసు పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పని చేశాడు.
 
== బాల్యం ==
పంక్తి 16:
 
==సూరి బిరుదు==
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో కంపెనీ వారు [[మద్రాస్]] లోని సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో [[ఇంగ్లీషు]]వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ట్యూటర్ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుడిని నియమించేవారు. ట్యూటర్ గా పుదూరి సీతారామశాస్త్రిగారు రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు 1847లో ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్లకే ఆ ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగానికి అర్జీలు పంపిన చిన్నయని, పురాణం హయగ్రీవశాస్త్రిని పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పట్లో పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, [[బ్రాహ్మణ]] కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది. వైదికులే కాక నియోగులై నప్పటికీ పండితులందరూ శాస్త్రి అనే బిరుదు పెట్టుకునేవారు. చిన్నయకి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను బ్రాహ్మణుడు కాకపోవడం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం “సూరి” అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి [[ఇంగ్లాండు|ఇంగ్లండు]] నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొపేరుతో ప్రచారం లోకి వచ్చాడు.
 
==రచనలు==