ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మేటర్ చేర్చాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిన్న మార్పులు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 142:
2014 లో ఐఎస్ ఆధిపత్యం కింద గల ప్రాంతాల్లో ఎనిమిది మిలియన్ల మంది సామాన్య ప్రజలు నివసిస్తున్నట్టు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక లెక్కగట్టింది. వీరిని తమ కఠిన నియంత్రణ కింద ఐఎస్ ఉంచుతుందనీ, తమ మాట పాటించే వారికే వివిధ సేవలు అందేలా చూస్తుందనీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ప్రజలు ఐఎస్ అనుసరించే షరియా చట్టాన్ని పాటించి తీరాలి.
 
== సైనికులు ==
ఐఎస్ కింద రెండు లక్షల మంది దాకా సైనికులున్నారనీ, అందులో సగం మంది విదేశీయులేననీ (ఇరాక్, సిరియా వారు కాకుండా) 2015 లో అంచనా వేశారు. దాదాపు 80 దేశాలకి చెందిన పదిహేను వేల మంది సైనికులు ఐఎస్ లో ఉన్నారని 2014 నవంబర్ లో ఐక్యరాజ్యసమితి లెక్క గట్టగా, 2015 ఫిబ్రవరి నాటికి 20,000 మంది విదేశీ సైనికులున్నారనీ, అందులో 3,400 మంది పాశ్చాత్యులనీ అమెరికా నిఘా వర్గాలు లెక్క గట్టాయి. 2015 సెప్టెంబర్ నాటికి ఐఎస్ లో 30,000 మంది విదేశీ దళాలు ఉన్నాయని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ అంచనా వేసింది. విదేశీ సైనికులకు తిండీ బట్టా ఇవ్వడం తప్ప వేతనాలేవీ ఇవ్వరనీ, సిరియా సైనికులకు మాత్రం జీతాలిస్తారనీ గతంలో ఐఎస్ లో సీనియర్ నాయకుడైన అబు హజ్జర్ ఒకసారి వెల్లడించాడు.
 
== ఆయుధాలు ==
ఐఎస్ ప్రధానంగా సాంప్రదాయ ఆయుధాలనే ఉపయోగిస్తుంది. సద్దాం హుసేన్ పాలనా కాలంలో ఇరాక్ లో ఆయన హయాంలో పోగేసిన ఆయుధాలనే ఈ బృందం చాలా వరకూ ఉపయోగిస్తూ వస్తోంది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న తుపాకులు, కొన్ని విమానాలు తదితరాలను, వాటితో పాటు సిరియాలో అంతర్యుద్ధంలో ఇరు పక్షాలు వాడే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని ఉపయోగిస్తోంది. ట్రక్కు కారు బాంబులు, ఆత్మాహుతి బాంబర్లను కూడా ఈ బృందం ఉపయోగిస్తుంది. ఒకటి రెండు సార్లు రసాయన ఆయుధాలను కూడా ఉపయోగించినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.
 
ఐఎస్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నించి తమ బృందంలోకి కొత్త సభ్యులని చేర్చుకుంటూ వచ్చింది. జిహాద్ లేదా పవిత్ర యుద్ధం పేరుతో వీరిని ఆకర్షించి సైనికులుగానూ, ఇతర పలు స్థాయుల్లోనూ చేర్చుకుంటుంది. ఈ సైనికులని ముజాహిదీన్ గా పిలుస్తారు. నర్సులు గానూ, వంట వారిగానూ, ప్రధమ చికిత్స తదితరాల కోసం మహిళలని కూడా ఐఎస్ చేర్చుకుంటుంది. ఐఎస్ లోని విదేశీ పాశ్చాత్య దళాలలో పది శాతం మంది పాశ్చాత్య మహిళలు ఉన్నారని 2015లో అంచనా వేశారు.
 
== ప్రచారం ==
ఐఎస్ తమ బృందం గురించిన ప్రచారం కోసం వీడియోలు, సీడీలు, డీవీడీలు, పోస్టర్లు, పాంప్లెట్లు తదితరాలను ఉపయోగించడంతో పాటు ఇంటర్నెట్ ఆధారంగా కూడా ప్రచారం చేస్తుంది. కొన్ని టీవీ ఛానెళ్ల ద్వారా తమ అధికారిక ప్రకటనలుు కూడా విడుదల చేస్తుందిి. 2014 లో పాాశ్చాత్యదేశాల్లో వారికిి తమ వార్తలు ప్రసారంం చేసేందుకు అల్ హయత్ మీడియా కేంద్రం పేరిట ఒక ప్రాపగాండా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 23 భాషల్లో ప్రసారాలుు చేసిందిి. 2014 జుులైలో దబీక్్ పేరిట డిజిటల్ పత్రికనుు ప్రారంభించింది. అది ఇంగ్లీషు తో సహా పలు భాాషల్లో ముద్రించింది. తర్వాత మరిన్ని రకాలుగా కూడ ప్రచారాలుు చేసిింది. ఇవే కాకుండా సోషల్ మీీడియాలో కూడా తమ సిద్ధాంతాల గురించి ప్రచాారం చేసి యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేేసింది.
 
== ఆర్థిక వనరులు ==
ఐఎస్ బృందానికి ప్రధానంగా అయిదు మార్గాల గుండా ఆదాయం లభించిందని 2015 లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.