అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
1939లో మద్రాసు శాసనసభకు [[కాంగ్రెస్]] పార్టీ తరఫున విజయవాడ- [[బందరు]]లకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించాడు. [[చక్రవర్తి రాజగోపాలాచారి|రాజగోపాలాచారి]] ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. 1946లో [[విజయవాడ]] నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు [[ప్రకాశం పంతులు]] పక్షం వహించాడు. [[టంగుటూరి ప్రకాశం]] మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది. ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నాడు. 1947లో కాళేశ్వరరావు [[శాసనసభ]]లో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టాడు.
 
==సభాపతిగా==
==స్పీకరుగా==
స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా [[విజయవాడ నియోజకవర్గం]] నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి [[సభాపతి]]గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.
 
==రచయితగా==
అయ్యదేవర కాళేశ్వరరావు పలు పుస్తకాలను తెలుగులో రచించారు. వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపధ్యం పై అనేక రచనలు చేసారు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రపై పుస్తకాలు రాసారు. ఆయన రాసిన 'నా జీవిత కథ' అనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగి ఉంది.<ref>{{cite book |title=50 వసంతాల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతులు, ఉపసభాపతులు |publisher=ఆంధ్రప్రదేశ్ శాసనసభ |page=1}}</ref>