విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
హైందవ సంస్కృతిలో వస్త్రధారణ వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ ఫిలిప్ బి వాగనర్ - "హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో దుస్తుల ప్రయోజనం శరీరాన్ని కప్పడం, అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది." అంటాడు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=3}} అందుకు అనుగుణంగానే ఆ కాలానికి చెందిన మిగిలిన స్వతంత్ర దక్షిణ భారత హిందూ రాజ్యాలలో రాజాస్థానాలలో పూర్వపు హిందూ పద్ధతుల్లోనే వస్త్రధారణ సంప్రదాయాలు కొనసాగాయి. దాని ప్రకారం ఆస్థానికుల్లో పురుషులు, ఇతర సాధారణ వ్యక్తులు, చివరికి మహారాజు సైతం పైభాగాన్ని ఆచ్ఛాదన లేకుండా వదిలివేసి, నడుము కింది భాగంలో మాత్రం పంచెలు ధరించేవారు. ఆ పంచెల నాణ్యత, నేతలో భేదాలు ఉండేవి. ఈ పద్ధతి కాలికట్, కొచ్చిన్ మొదలుకొని కుయిలోన్, సిలోన్ (శ్రీలంక), మాల్దీవులు వంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నట్టు విదేశీ ముస్లిం యాత్రికులు అబ్దుల్ రజాక్, మా హుఆన్ గమనించి రాసుకున్నారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}} అనాచ్ఛాదితమైన ఛాతీపై పడేలా అంగవస్త్రాన్ని వేసుకునేవారు. తలపైన రాజులు బంగారంతో చేసి రత్నాలు పొదిగిన కిరీటాలు, రాజాస్థానీకులు తలపాగాలు ధరించేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=3}}
=== ముస్లిం వస్త్రధారణ పద్ధతులు ===
ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది.
 
==మూలాలు==