విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి.
=== దౌత్య, రాజకీయ కారణాలు ===
దక్కన్‌లో తమకు చిరకాల ప్రత్యర్థులైన బహమనీ సుల్తానులు, వారి నుంచి చీలిపోయిన నాలుగు షాహీ వంశాలతో పోటీకి, పోరాటాలకు తట్టుకోవడానికి విజయనగర చక్రవర్తులు పర్షియా, టర్కీ, పోర్చుగీసు దేశస్థులతో దౌత్యానికి, వ్యాపారానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. పర్షియన్, టర్కీ తదితరక్రమంలో ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి. దౌత్యవేత్తలకు, మంత్రులకు, కవులకు విజయనగర చక్రవర్తులు మేలిమి రకం కుల్లాయి, అంగీ బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ప్రారంభించారు.
 
==మూలాలు==