విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
తలపై కిరీటాలు కాక అందరూ కుళ్ళాయి అని పిలిచే గుడ్డ టోపీ ధరించేవారు. వారి వారి స్థాయిని బట్టి దానికి జరీ పని ఉండేది. కింది స్థాయి ఆస్థానీకులు, సేవకులు తదితరులు ఏ జరీ లేని సామాన్యమైన కుళ్ళాయి ధరించేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}} కృష్ణదేవయరాయల కుళ్ళాయి రెండు అడుగుల పొడవు ఉండేదనీ, రాణివాసాల్లో మసిలే మహిళలు ముత్యాలతో చేసిన దండలు అలంకరించిన కుళ్ళాయిలు ధరించేవారనీ విదేశీయాత్రికులు పేర్కొన్నారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=3}}
 
[[File:K238283.png|thumb|తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆచ్ఛాదన లేని పైభాగంతో కృష్ణదేవరాయల విగ్రహం]]
ఇలాంటి వస్త్రధారణ కేవలం కొలువుకు సంబంధించిన సందర్భాల్లోనే వాడేవారు. ఇంటిపట్టున ఉన్నప్పుడు, ఆంతరంగిక సందర్భాల్లోనూ మాత్రం అదే రాజపురుషులు పైపంచ తప్ప పైన ఏ ఆచ్ఛాదనా లేకుండా, నడుము కింద పంచెతో హైందవ సంప్రదాయాల్లో ఉండేవారు. దైవదర్శనార్థం ఆలయాలకు వెళ్ళినప్పుడు పైపంచ తీసి నడుముకు చుట్టుకుని, నడుము కింద పట్టుపంచె ధరించేవారు. దీనికి నిదర్శనగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో తన భార్యలతో ఉన్న కృష్ణదేవరాయల విగ్రహం కనిపిస్తుంది. అదే కృష్ణదేవరాయలు కొలువుదీరినప్పుడు అంగీ, పట్టుదట్టి, కుల్లాయి, పంచెలతో ఉండేవాడని హంపిలోని పలు విగ్రహాలు, విదేశీయుల రచనలు సాక్ష్యమిస్తున్నాయి.