"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ''' పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది. రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది [[ఇస్లామీయకరణ]] అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
 
ఆనాటి దక్కన్ రాజకీయ స్థితిలో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగరానికి]] [[పర్షియా]], [[టర్కీ]] దేశాలతో దౌత్య, వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి. [[మధ్యప్రాచ్యం]] కేంద్రంగా ప్రపంచంలోని దూరతీరాలకు మతప్రసక్తి లేకుండా విస్తరిస్తున్న ఇస్లామీయ సంస్కృతిలో విజయనగరం కూడా భాగం పంచుకోవడంలో విజయనగర రాజాస్థాన వస్త్రధారణ తనవంతు సాయం చేసింది.
 
== దుస్తుల శైలి ==
=== చక్రవర్తి, రాజాస్థానీకుల వస్త్రధారణ ===
బొత్తాలు ఉన్న అంగీ, తలపైన కుళ్ళాయి (టోపీ లాంటిది), నడుము కింది భాగంలో పంచె అన్నవి విజయనగర సామ్రాజ్యకాలంలో పురుషులు, మరీముఖ్యంగా రాజాస్థాన పురుషుల దుస్తులు. అంగీ చేతులు కొంచెం బిగువుగా ఉండేవి. కొందరి అంగీలు పొడుగ్గా కింద మోకాళ్ళ వరకూ, మరికొందరివి నడుము వరకు మాత్రమే ఉండేది. చరిత్రకారుడు [[ఫిలిప్ బి. వాగనర్]] దీన్ని పరిశీలిస్తూ ఆ పొడుగు, పొట్టి అంగీలు వారి వారి సామాజిక స్థాయిని సూచిస్తూ ఉండవచ్చనీ, పొట్టి అంగీలవారు సేవకులు కావచ్చనీ అభిప్రాయపడ్డాడు. అంగీ మెడ వెడల్పుగా, కప్పడానికి మడతపెట్టిన ఒక పట్టీతో ఉండేది. అంగీ ముందుభాగం తొడుక్కోవడానికి వీలుగా చీలివుండి, బొత్తాలతో ఉండేది. విజయనగర చక్రవర్తి ధరించే అంగీ పల్చగా ఉండేది. దాన్ని నూలు, పట్టు, జరీ ముడిగుడ్డలుగా వినియోగించి పనితనంతో నేసినదిగా విదేశీ యాత్రికులు గుర్తించారు. రాజు ధరించే అంగీ మేలైన రకం పట్టుతో ఉండడమే కాక జరీలో బంగారాన్ని విస్తారంగా వాడి వివిధ రూపాలను చిత్రించేవారని [[ఫెర్నావో న్యూనిజ్|న్యూనిజ్]] పేర్కొన్నాడు. ఇక మిగిలిన ఆస్థానీకులు, సాధారణ సేవకులు ధరించే అంగీలు వారి వారి స్థాయిలను బట్టి వివిధ నాణ్యతలు కలిగిన బట్టతో కుట్టేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}}
 
తలపై కిరీటాలు కాక అందరూ కుళ్ళాయి అని పిలిచే గుడ్డ టోపీ ధరించేవారు. వారి వారి స్థాయిని బట్టి దానికి జరీ పని ఉండేది. కింది స్థాయి ఆస్థానీకులు, సేవకులు తదితరులు ఏ జరీ లేని సామాన్యమైన కుళ్ళాయి ధరించేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}} కృష్ణదేవయరాయల[[శ్రీ కృష్ణదేవ రాయలు]] కుళ్ళాయి రెండు అడుగుల పొడవు ఉండేదనీ, రాణివాసాల్లో మసిలే మహిళలు ముత్యాలతో చేసిన దండలు అలంకరించిన కుళ్ళాయిలు ధరించేవారనీ విదేశీయాత్రికులు పేర్కొన్నారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=3}} పన్నుల సేకరణ, లెక్కలు రాసే [[కరణం|కరణాలు]] బోడ కుల్లాలు (చిన్న కుల్లాయిలు), చింపి కుప్పసములు (కుప్పసములంటే అంగీలు) ధరించేవారని పరమయోగి విలాసమనే ద్విపద కావ్యంలో రాసివుంది.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ" />
 
[[File:K238283.png|thumb|[[తిరుమల]] [[తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం|శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోఆలయం]]లో ఆచ్ఛాదన లేని పైభాగంతో కృష్ణదేవరాయల విగ్రహం]]
ఇలాంటి వస్త్రధారణ కేవలం కొలువుకు సంబంధించిన సందర్భాల్లోనే వాడేవారు. ఇంటిపట్టున ఉన్నప్పుడు, ఆంతరంగిక సందర్భాల్లోనూ మాత్రం అదే రాజపురుషులు పైపంచ తప్ప పైన ఏ ఆచ్ఛాదనా లేకుండా, నడుము కింద పంచెతో హైందవ సంప్రదాయాల్లో ఉండేవారు. దైవదర్శనార్థం ఆలయాలకు వెళ్ళినప్పుడు పైపంచ తీసి నడుముకు చుట్టుకుని, నడుము కింద పట్టుపంచె ధరించేవారు. దీనికి నిదర్శనగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో తన భార్యలతో ఉన్న కృష్ణదేవరాయల విగ్రహం కనిపిస్తుంది. అదే కృష్ణదేవరాయలు కొలువుదీరినప్పుడు అంగీ, పట్టుదట్టి, కుల్లాయి, పంచెలతో ఉండేవాడని హంపిలోని పలు విగ్రహాలు, విదేశీయుల రచనలు సాక్ష్యమిస్తున్నాయి.
 
 
== దుస్తుల పరిశ్రమ ==
విజయనగర కాలంలో దుస్తులను రూపొందించే [[నేతపని|నేత పరిశ్రమ]] అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటి. నూలు వడకడం, నేయడం, బట్టలు కుట్టడం, అమ్మడం అన్నవి దీనిలో ముఖ్యమైన దశలు. శూద్ర కులస్తుల్లో ఎక్కువమంది రాట్నాల మీద నూలు వడికేవారనీ, వాటిని సాలెలు నేసేవారనీ సురవరం ప్రతాపరెడ్డి రాశాడు. సాలెల్లో సాలె, [[పద్మశాలీలు|పద్మసాలె]], పటుసాలె, అగసాలె, వానె వంటి వివిధ శాఖలుండేవి. వారిలో పట్టువస్త్రాలు నేసేవారు పటుసాలెలు, వ్యాపారస్తులు వానెలు.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ" />
 
== రాజకీయ, సాంస్కృతిక ప్రభావాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630978" నుండి వెలికితీశారు