విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ''' పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది. రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది [[ఇస్లామీయకరణ]] అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
 
ఆనాటి దక్కన్ రాజకీయ స్థితిలో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగరానికి]] [[పర్షియా]], [[టర్కీ]] దేశాలతో దౌత్య, వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి. [[మధ్యప్రాచ్యం]] కేంద్రంగా ప్రపంచంలోని దూరతీరాలకు మతప్రసక్తి లేకుండా విస్తరిస్తున్న ఇస్లామీయ సంస్కృతిలో విజయనగరం కూడా భాగం పంచుకోవడంలో విజయనగర రాజాస్థాన వస్త్రధారణ తనవంతు సాయం చేసింది. విజయనగర సామ్రాజ్య కాలం నాటికి తీరాంధ్ర, కొచ్చిన్, సిలోన్ వంటి ప్రాంతాల్లో మహారాజు సైతం నడుము పైభాగాన్ని ఉత్తరీయానికి మించి మరే వస్త్రం లేకుండా అనాచ్ఛాదితంగా వదిలేయడమే ఉండేది. రాజాస్థానాల్లో అంగీ ధరించడం అన్నది మధ్యయుగాల నాటి దక్షిణ భారత హిందూ రాజ్యాల్లో ఒక అసాధారణమైన మార్పు.
 
== దుస్తుల శైలి ==