"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Ceiling paint at Lepakshi temple.JPG|thumb|[[లేపాక్షి]] [[లేపాక్షి వీరభద్రాలయం|వీరభద్రాలయంలో]] కుడ్యచిత్రాల్లో కుల్లాయి, అంగీ, పంచె ధరించిన రాజపురుషులు]]
'''విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ''' పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది. రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది [[ఇస్లామీయకరణ]] అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
 
== దుస్తుల శైలి ==
=== చక్రవర్తి, రాజాస్థానీకుల వస్త్రధారణ ===
[[File:Nayaka-2-.jpg|thumb|జరీచేసిన వివిధ రకాల కుల్లాయిలు ధరించి రాజపురుషులు]]
[[File:Ceiling paint at Lepakshi temple.JPG|thumb|[[లేపాక్షి]] [[లేపాక్షి వీరభద్రాలయం|వీరభద్రాలయంలో]] కుడ్యచిత్రాల్లో కుల్లాయి, అంగీ, పంచె ధరించిన రాజపురుషులు]]
బొత్తాలు ఉన్న అంగీ, తలపైన కుళ్ళాయి (టోపీ లాంటిది), నడుము కింది భాగంలో పంచె అన్నవి విజయనగర సామ్రాజ్యకాలంలో పురుషులు, మరీముఖ్యంగా రాజాస్థాన పురుషుల దుస్తులు. అంగీ చేతులు కొంచెం బిగువుగా ఉండేవి. కొందరి అంగీలు పొడుగ్గా కింద మోకాళ్ళ వరకూ, మరికొందరివి నడుము వరకు మాత్రమే ఉండేది. చరిత్రకారుడు [[ఫిలిప్ బి. వాగనర్]] దీన్ని పరిశీలిస్తూ ఆ పొడుగు, పొట్టి అంగీలు వారి వారి సామాజిక స్థాయిని సూచిస్తూ ఉండవచ్చనీ, పొట్టి అంగీలవారు సేవకులు కావచ్చనీ అభిప్రాయపడ్డాడు. అంగీ మెడ వెడల్పుగా, కప్పడానికి మడతపెట్టిన ఒక పట్టీతో ఉండేది. అంగీ ముందుభాగం తొడుక్కోవడానికి వీలుగా చీలివుండి, బొత్తాలతో ఉండేది. విజయనగర చక్రవర్తి ధరించే అంగీ పల్చగా ఉండేది. దాన్ని నూలు, పట్టు, జరీ ముడిగుడ్డలుగా వినియోగించి పనితనంతో నేసినదిగా విదేశీ యాత్రికులు గుర్తించారు. రాజు ధరించే అంగీ మేలైన రకం పట్టుతో ఉండడమే కాక జరీలో బంగారాన్ని విస్తారంగా వాడి వివిధ రూపాలను చిత్రించేవారని [[ఫెర్నావో న్యూనిజ్|న్యూనిజ్]] పేర్కొన్నాడు. ఇక మిగిలిన ఆస్థానీకులు, సాధారణ సేవకులు ధరించే అంగీలు వారి వారి స్థాయిలను బట్టి వివిధ నాణ్యతలు కలిగిన బట్టతో కుట్టేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630998" నుండి వెలికితీశారు