మార్క్ స్పిట్జ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1950, ఫిబ్రవరి 10న అమెరికాలో కాలిఫోర్నియాలోని మోడెస్టోలో జన...
 
పంక్తి 1:
[[1950]], [[ఫిబ్రవరి 10]]న [[అమెరికా]]లో [[కాలిఫోర్నియా]]లోని మోడెస్టోలో జన్మించిన '''మార్క్ స్పిట్జ్''' ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు. [[1972]]లో [[జర్మనీ]]లోని [[మ్యూనిచ్]]లో జరిగిన [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడలలో]] 7 స్వర్ణ పతకాలు సాధించి ఒకే ఒలింపిక్ క్రీడలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు సృష్టించాడు. [[1968]]లో జరిగిన [[మెక్సికో]] ఒలింపిక్ క్రీడలలో కూడా మార్క్ స్పిట్జ్ 2 స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించడంతో అతని ఖాతాలో మొత్తం 9 స్వర్ణాలు మరియు ఒక్కొక్కటి చొప్పున రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.
==జీవితం==
అతను రెండు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే అతడి కుటుంబం [[హవాయి]]కి పయనమైంది అక్కడే స్పిట్జ్ ఈతకొట్టడం నేర్చుకున్నాడు. మరో నాలుగేళ్ళ తరువాత కుటుంబం [[కాలిఫోర్నియా]]లోని సాక్రమెంటోకు తిరిగివచ్చింది. అక్కడ స్పిట్జ్ స్విమ్మింగ్ క్లబ్‌లో చేరినాడు. 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆర్డెన్ హిల్స్ స్విమ్మింగ్ క్లబ్‌లో శిక్షణ పొందినాడు. అక్కడ శిక్షణ ఇచ్చిన కోచ్ ద్వారా మార్క్ స్పిడ్జ్ కాకుండా మరో ఆరుగురు ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకాలను సాధించడం విశేషం.
==ఒలింపిక్ క్రీడలలో==
[[1968]]లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 6 స్వర్ణాలు సాధించాలని కలలు కన్ననూ అతనికి లభించినవి రెండు స్వర్ణాలు మాత్రమే. అవి కూడా 4 x 100 మీటర్ల ఫ్రీస్టైల్ మరియు 4 x 200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో సాధించిన టీం స్వర్ణాలు. దీంతో బాటు స్పిట్జ్ వ్యక్తిగతంగా 100 మీతర్ల బట్టర్‌ఫ్లైలో రజత పతకం, 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం పొందినాడు.
"https://te.wikipedia.org/wiki/మార్క్_స్పిట్జ్" నుండి వెలికితీశారు