మార్క్ స్పిట్జ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==ఒలింపిక్ క్రీడలలో==
[[1968]]లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 6 స్వర్ణాలు సాధించాలని కలలు కన్ననూ అతనికి లభించినవి రెండు స్వర్ణాలు మాత్రమే. అవి కూడా 4 x 100 మీటర్ల ఫ్రీస్టైల్ మరియు 4 x 200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో సాధించిన టీం స్వర్ణాలు. దీంతో బాటు స్పిట్జ్ వ్యక్తిగతంగా 100 మీతర్ల బట్టర్‌ఫ్లైలో రజత పతకం, 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం పొందినాడు.
 
మెక్సికో ఒలింపిక్ క్రీడలలో అనుకున్న విధంగా పతకాలు సాధించకున్ననూ నిరాశపడక మరింత కఠోర శిక్షణ పొంది తదుపరి ఒలింపిక్ క్రీడలపై దృష్టి పెట్టినాడు. జర్మనీ లోని మ్యూనిచ్‌లో జరిగిన 1972 ఒలింపిక్ క్రీడలలో మార్క్ స్పిడ్జ్ అనుకున్న విధంగా మొత్తం 6 ఈవెంట్లలోనూ బంగారు పతకాలు సాధించడమే కాకుండా మరో పతకం అదనంగా సాధించి ఒలింపిక్ క్రీడా చరిత్రలోనే ఎవరికీ అందనంతా ఎత్తుకు చేరినాడు. చేపపిల్లలా ఈదుతూ ప్రతి ఈవెంట్లలోనూ ప్రథమ స్థానంలో నిలిచి చూపురులను ఆకట్టుకున్నాడు. సహచరులచే '''మార్క్ ది షార్క్''' అని పిలువబడ్డాడు. 1972లో స్పిట్జ్ సాధించిన ఒకే ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాల రికార్డు నేటికీ నిలిచి ఉండుట విశేషం.
"https://te.wikipedia.org/wiki/మార్క్_స్పిట్జ్" నుండి వెలికితీశారు