సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
spelling mistake
పంక్తి 40:
16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]ను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.
 
ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. [[1990]] దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ [[ముంబాయి]]కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. [[2002]]లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో [[ఆస్ట్రేలియా]]కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[వివియన్ రిచర్డ్స్]] ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.<ref name="Tribune1">[[The Tribune]] http://www.tribuneindia.com/2002/20021214/sports.htm#4. December 14, 2002</ref> . [[2003]]లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో [[వివియన్ రిచర్డ్స్]]కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుందికనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో [[అక్టోబర్ 17]], [[2008]] న వెస్ట్‌ఇండీస్ కు చెందిన [[బ్రియాన్ లారా]]ను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ <ref>[http://www.hindu.com/2004/12/12/stories/2004121202031900.htm 'The Hindu' Indian National Newspaper Article on Sachin's 34th Century]</ref><ref>[http://news.bbc.co.uk/sport2/hi/cricket/6462199.stm BBC Article, ''Tendulkar achieves superhero status'']</ref> అని పిలువబడే సచిన్ [[1989]]లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. [[1997]]-[[1998]]లో [[రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న]] పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=31d055a3-de0d-4969-93bf-82b186a50fc0&ParentID=d9bbcde5-db34-4afc-87e6-e4cca6aa5033&MatchID1=4586&TeamID1=1&TeamID2=8&MatchType1=1&SeriesID1=1151&MatchID2=4588&TeamID3=3&TeamID4=5&MatchType2=1&SeriesID2=1152&PrimaryID=4586&Headline=Tendulkar+is+Warne's+greatest Tendulkar is Shane Warne's Greatest]</ref><ref>[http://www.india-today.com/itoday/04051998/sport.html The Best Cricketer]</ref><ref>[http://www.dawn.com/2004/03/17/spt2.htm Tendulkar is greatest, says Pakistan's Captain Inzamam]</ref>
 
2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. [[2012]], [[మార్చి 16]]న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు