తిరుమల సుప్రభాత సేవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారువాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు(పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంతసేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్ధం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ.120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వార ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. సంవత్సరంలో ఒక్క మార్గశిర (డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.
[[సభ్యులు:Ramakrishnadeekshit|Ramakrishnadeekshit]] 04:31, 9 ఫిబ్రవరి 2008 (UTC)