ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 62:
** ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.
===[[రావి కొండలరావు]] గారి అభిప్రాయం<ref name="ఆత్రేయని చీల్చిచెండాడిన తెలుగు మాస్టారు!">{{cite web|url=http://www.eenadu.net/Homeinner.aspx?item=break200|title="ఆత్రేయని చీల్చిచెండాడిన తెలుగు మాస్టారు! " |publisher=[[ఈనాడు]] |date= 2015-10-23|accessdate=2015-10-23}}</ref>===
నాకు తెలిసి, ఆత్రేయ ఒక డబ్బింగ్ సినిమాకు రాశారు. ఆ సినిమా [[తమిళం]]. దాని పేరు 'అళగి' అంటే సుందరి. ఆత్రేయగారికి తమిళం వచ్చు. తెలుగులో మరి, ఏం పేరు పెట్టారో! నేను డబ్బింగ్‌లు చెబుతూ, ఆ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఆత్రేయ గారిని కలిశాను. [[మద్రాసు]] రాయిపేటలో వున్న ఒక హోటల్ గదిలో వున్నారాయన. గదిలోకి వెళ్లగానే నేలమీద దిండు తలకింద పెట్టుకుని పడుకుని తమిళంలో వున్న దృశ్యాలు చదువుతూ పక్కన వున్న ఇద్దరు సహాయకులకి డిక్టేట్ చేస్తున్నారు. నేను నిలబడివుండగా నన్ను చూసి, 'ఎవరు?' అన్నారు. చెప్పుకున్నాను. ''ఎప్పుడు డబ్బింగ్ మొదలవుతుందో తెలీదు. మొదలైన తర్వాత వస్తే ఏదో పాత్రకి చెబుదురుగాని'' అని చెప్పి పంపించేశారు. ఐతే అది ఎప్పుడు మొదలైందో, అసలు మొదలైందో లేదో కూడా నాకు తెలిసి రాలేదు. నేను వెళ్ళలేదు. (ఈ సంఘటన 1954వ సంవత్సరంలో అని గుర్తు) అంతకు ముందొకసారి, రాజా అన్నాతమలైపురంలో ఆయన అద్దెకి వున్న పెద్ద ఇంటికి వెళ్ళి కలిశాను. ఉద్యోగార్థం. నేనొక రచయితనని, ఆయన దగ్గర అవకాశం ఇస్తే సహాయకుడిగా చేస్థాననీ అడిగాను. ''నేనే సహాయకుడిని. దర్శకుడు, నిర్మాత ఏం చెబితే అది రాస్తాను. నాకు మళ్ళీ సహాయకుడెందుకు?'' అనేశారు. ఆయన వీధి గుమ్మం ముందున్న పోర్టికోలో కూచున్నారు. నేను నిలబడే వున్నాను. నన్ను ఆయన కూచోమనలేదు, నేను కూచోలేదు. ఆయన ఆ మాట చెప్పగానే [[నమస్కారం]] పెట్టి వచ్చేశాను.
 
ఆదుర్తిగారు 'తేనె మనసులు' (1965) తీస్తున్నప్పుడు పరిచయం అయింది ఆత్రేయ గారితో. ఐతే, అంతకు ముందు నేను కలిసిన సందర్భాలు ఆయనకి గుర్తులేవు. నేనూ గుర్తు చెయ్యలేదు. తేనేమనసులులో నాకు వేషం లేదు. కాని, నా భార్య రాధాకుమారితో [[హైదరాబాదు]] వచ్చాను. మొత్తం నటీనటులందరికీ సారిథి స్టూడియోలోనే బస. ఆత్రేయగారు లక్డీకాపూల్‌లో ఉన్న వెంకటేశ్వరా లాడ్జిలో వుండేవారు. ఆయన, ఆదుర్తిగారు, నిర్మాత సుందరంగారూ, ఇద్దరు సహాయకులూ. నేను సినిమా జర్నలిస్టుని. ఆదుర్తి గారితో ఇంటర్వ్యూ చేశాను... [[ఆంధ్రజ్యోతి]] దినపత్రికకి. ఆదుర్తి గారు నేను రాసిన నాటకాలు చూశారు. అప్పుడు '[[మూగమనసులు]]' రజతోత్సవం చేసుకోబోతోంది హైదరాబాదులో. ఆ వేదిక మీద అందరి గురించి రాసిన సన్మానపత్రం - సమర్పించాలి. నా అదృష్టం కొద్దీ ఆ సన్మానపత్రం నన్ను రాయమన్నారు- ఆదుర్తిగారు. ఆ సందర్భంలో ఆత్రేయగారిని కలిశాను. కలిశాను ఏమిటి- [[ఆదుర్తి సుబ్బారావు]] గారు కలిపారు. 'మూగమనసులు' కథలో, సంభాషణల్లో ముళ్లపూడి రమణగారి ప్రమేయం ఉంది. ఆయన [[మద్రాసు]]లో వుండి, '[[ప్రేమించి చూడు]]' రాస్తున్నారు. 'తేనెమనసులు' కథలోనూ రమణ గారి ప్రమేయం ఉంది. ఆ సినిమాలో రాధాకుమారికి వేషం వుందన్న విషయం రమణ గారే మా యింటికి వచ్చి చెప్పారు. ఆ చేత్తోనే నాకు లేదనీ చెప్పారు. నేను 'దాగుడుమూతలు'లో వేశాను కదా- అందుకట. ''మరి రాధాకుమారీ వేసింది కదా'' అని వాదించాను. ఆ పాత్రకి సరైన వాళ్లు దొరకలేదని, అంచేత తప్పని సరిగా రాధాకుమారికి ఇవ్వవలసి వచ్చిందనీ, కృష్ణకి తల్లి పాత్ర అనీ, రాధాకుమారి అలా కనిపించదు గనక, కృష్ణ తండ్రి (చలపతిరావు)కి రెండోభార్యగా మార్చామనీ చెప్పారు- రమణ గారు. 'మూగమనసులు' సన్మానపత్రం ఫస్ట్ వెర్షన్ (సినిమా భాష) రాసి ఆదుర్తి గారు, ఆత్రేయ గారూ వుండగా చదివి వినిపించాను. ఇంకొంచెం విస్తరింపు కావాలని టెక్నీషియన్లని ఇంకా మెచ్చుకోవాలనీ సలహా ఇచ్చారు. మళ్లీ రాసి, వినిపిస్తే ''బాగుంది'' అన్నారు ఆదుర్తిగారు. అని, ''మీరే చదవండి వేదిక మీద'' అని గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఆత్రేయ గారి ముందు- ఎవరో చెప్పగా- 'తెలుగు మాస్టారు' ప్రహసనం చేశాను. ఆయన చాలా ఆనందంగా నవ్వి, ఇంకోసారి చెప్పమన్నారు. అలా ఆ పరిచయం ''ముదిరి''- ఆత్రేయగారిని, తెలుగు మాస్టారు కలిస్తే ఎలా మాట్లాడతారో చెప్పమంటే- చెప్పాను. ఆయన్ని, ఆయన రచనల్ని రాసే విధానాల్ని ''చీల్చి చెండాడాను''. ఆయన ఎంత నవ్వారో! ఎంత స్పోర్టివ్‌గా ఆనందించారో! ''శిలలపై శిల్పాలు చెక్కినారూ- ఏమిటి, శిలలపై శిల్పాలు కాక, పెన్సిళ్లు చెక్కుతారా- ఏమిటి తమ రచన?'' అంటూ, ఇలాంటివే.
పంక్తి 134:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు