రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
రాజబాబు [[తాతా మనవడు]], [[పిచ్చోడి పెళ్ళి]], [[తిరుపతి]], [[ఎవరికి వారే యమునా తీరే]], [[మనిషి రోడ్డున పడ్డాడు]] లాంటి సినిమాలలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో [[ఎవరికి వారే యమునా తీరే]], [[మనిషి రోడ్డున పడ్డాడు]] సినిమాలను స్వయంగా [[బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్]] అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.
==స్వభావం==
సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన [[బాలకృష్ణ]] ను సత్కరించారు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.[[శివరామకృష్ణయ్య]], [[సూర్యకాంతం]], [[సావిత్రి]],[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేట లో భూమి ఇచ్చాడు. అంతే కాక [[కోరుకొండ]]లో జూనియర్ కాలేజీ కట్టించారు. దాని పేరుకూడాఅపేరుకూడా ఆయన పేరు మీదే "[[రాజబాబు జూనియర్ కళాశాల]]" గా ఉంది.
 
==సత్కారాలు==
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నందీ బహుమతులు, మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పాందారు. "చెన్నై ఆంధ్రా క్లబ్బు" వారు వరుసగా ఐదు సంవత్సరాలు "రోలింగ్ షీల్డు" ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందారు.
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు