ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 22:
==వ్యక్తిగత జీవితము==
===బాల్యం, విద్యాభ్యాసం===
వీరి స్వగ్రామం [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[నిడమర్రు]]. వీరిది మధ్యతరగతి [[రైతు]] కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న [[చిననిండ్రకొలను|పత్తేపురం]]లోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.
 
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్‌ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు.తన క్లాస్‌మెట్‌ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్లి చేయించడం విశేషం.
 
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం [[కొడుకు]] చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
పంక్తి 205:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:2015 మరణాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు