మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పుట్టిన రోజు తేది
ట్యాగు: 2017 source edit
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 28:
శాసనములను ప్రకతించుటయందు ముఖ్యముగ వారి నిదానము, పాఠనిర్ణయము, సంపూర్ణమైన చక్కని వ్యాఖ్య ప్రతి శాసన పరిశోధకుడును నేర్వవలసియున్నది. తొందరపాటు అనునదే వారెరుగరు. పాఠ నిర్ణయమున తుదకొక్క అక్షర విషయమున చిన్న మార్పును సుచించినవారినైనా పెద్దగా ప్రశంసించుట వారికలవాటు. కేవలము <nowiki>'''</nowiki>భారతి<nowiki>'''</nowiki> లో వారు ప్రకటించిన శాసనములు సుమారు 30; ఎపిగ్రాఫియా ఇండికాలోనివి 4-ఆంధ్రపత్రిక రజితోత్సవ సంపుటములు, తెలంగాణా శాసనములు ప్రకటించియున్నారు. ఆంధ్ర దేశమునకు సంబందించిన ముఖ్య శాసనములు కొన్ని ఆంగ్లములో ఇత్రరత్రా ప్రకటించినప్పుడు వాటిని ఆయా వ్యాసకర్తల పేరనే మరల భారతిలో చక్కగా సంస్కరించి ఆంధ్రావనికంద జేయుచుండెడివారు. శాసన పరిశోధనలో ప్రకటించిన శాసనముల సంఖ్య ముఖ్యముకాదు; వానిపాఠనిర్ణయము, వ్యాఖ్య ముఖ్యముగ గమనించదగినవి. శర్మ గారు వ్యాఖ్యలే అందుకు నిదర్శనములు.
 
ఆంధ్ర దేశములోని మౌర్య అశోకుని బ్రాహ్మీశిలా శాసనము మొదలుకొని ఇక్ష్యాక, శాలంకాయన, విష్ణుకుండిన, పల్లవ, తూర్పు చాళుక్య, గాంగవంశ, కాకతీయ, మునుసూరి, రెడ్ది, విజయనగర రాజుల శాసనలిపులన్నింటినీ వారు చక్కగా చదివి పరిష్కరించిరి. భారతిలో ప్రకటించిన అశోకుని రాయలసీమ, శాలంకాయన నందివర్మ పెదవేగి, వినయాదిత్యుని కర్నూలు, అరికేసరి కొల్లిపర్రు, దేవేంద్రవర్మకంబికాయ, హస్తివర్మ నర్సింగపల్లి, ముసునూరి ప్రోలనాయకుని విలస శాసనములు ఆయా రాజవంశముల చరిత్రకు కడుముఖ్యమైనవి.ఈ శాసనముల ఆధారంగా వారనేక చక్కని చారిత్రక లఘువ్యాసములు భారతిలో రచించిరి. అందు కడపటి పల్లనుల కాల నిర్ణయము, వేంగి చాళుక్యులు, వాతాపిచాళుక్యులు, కళింగకదంబులు, త్రిలోచన పల్లవుడు, వడ్డవారము, బౌద్దమత పరిణామము, పాల్కూరికి సోమన, జక్కన కవుల కాల నిర్ణయము, కులములుకుల సంఖ్య, చారిత్రక శతకములు, తంజావూరి మహారాష్ట్ర భూపతులు-ఆంధ్ర సాహిత్యము, యూరోపియనులు-ఆంధ్రభాషా చరిత్రసేవ మున్నగువానిలో ఆంధ్రదేశ సంస్కృతికి సంబందించిన వివిధ రంగములలోని విజ్ఞాన విశేషములు కరతలామలకము గావించిరి.
 
"భారతీయ లిపి శాస్త్రము", "ఆంధ్రదేశమున మాండలికుల పరిపాలన" అను రెండు గ్రంధములు శర్మగారి రచించదలపెట్టిరి, కాని మల్లంపల్లి సోమశేఖర శర్మ [[1963]]లో మరణించారు అందువల్ల ఆంధ్రులకు అవిలభించె అదృష్టము పోయినది.
పంక్తి 53:
*[http://www.amazon.co.uk/exec/obidos/search-handle-url/026-3749180-2713267?%5Fencoding=UTF8&search-type=ss&index=books-uk&field-author=Mallampalli%20Somasekhara%20Sarma అమెజాన్.కామ్ లింకు]
{{Authority control}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1963 మరణాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]