తుంగల చలపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 1:
'''తుంగల చలపతిరావు''', రంగస్థల నటుడు మరియు తొలితరం [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా నటుడు. ఈయన, [[కపిలవాయి రామనాథశాస్త్రి]], జొన్నవిత్తుల శేషగిరిరావు, [[దైతా గోపాలం]]లతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.<ref>[http://www.telugucinema.com/c/publish/starsprofile/tribute_pendyala.php సు'స్వరాల' మాల - పెండ్యాల] - తెలుగుసినిమా.కామ్</ref>
 
1935లో చలపతిరావు, [[దాసరి కోటిరత్నం]], బి.వి.రామానందంలతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[కలకత్తా]]లో [[సతీ సక్కుబాయి]] అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు [[కృష్ణుడు|కృష్ణు]]<nowiki/>నిగా నటించారు.<ref>[http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_1570.html శిరా కదంబం: మొదటి మహిళా చిత్ర నిర్మాత]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.
 
[[దివిసీమ]]<nowiki/>లోని [[శ్రీకాకుళం (ఘంటసాల)|శ్రీకాకుళం]]<nowiki/>లో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో 'సక్కుబాయి' పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం 'సతీ సక్కుబాయి'ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన 'మోహినీ భస్మాసుర' చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని [[ఏ.వి.సుబ్బారావు]], [[రేలంగి]], కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, [[పాండురంగ విఠల్‌]] చిత్రాలలో పనిచేశారు. ఆయన 35 సంవత్సరాలైనా నిండకుండానే గుంటూరుజిల్లా మంగళగిరిలో నటిస్తూ సక్కుబాయి పాత్రలో భక్తి తన్మయంతో పాండురంగనిలో ఐక్యమయ్యే సన్నివేశంలో ఆయన కూడా ఐక్యమైపోయారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-147601 దివి సీమ దివ్వెలు - ఆంధ్రప్రభ సెప్టెంబరు 23, 2010]</ref>
పంక్తి 13:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:రంగస్థల కళాకారులు]]
Line 19 ⟶ 20:
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/తుంగల_చలపతిరావు" నుండి వెలికితీశారు