కల్వకుంట్ల చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 48:
ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటుచేశాడు.<ref name="hindu.com">{{cite web|url=http://hindu.com/2001/04/28/stories/0428201c.htm|title=Dy. Speaker resigns, launches new outfit|date=28 April 2001|accessdate=2014-02-24|work=hindu.com|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/05/19/stories/0419201x.htm|title=Telangana finds a new man and moment|work=Hinduonnet.com|date=19 May 2001|accessdate=2011-06-30}}</ref> తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం మాజీ నక్సలైట్లు, తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం<ref>{{cite news |title='కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం పొరపాటు' |url=https://www.bbc.com/telugu/india-43221604 |accessdate=6 December 2018 |work=BBC News తెలుగు |date=28 February 2018}}</ref>, విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /><ref name="బీబీసీ తెలుగులో జయశంకర్ గురించి">{{cite news |last1=కాసం |first1=ప్రవీణ్ |title=ప్రొఫెసర్ జయశంకర్: 'శనివారం ఉపవాసాన్ని, తెలంగాణవాదాన్ని విడిచిపెట్టలేదు' |url=https://www.bbc.com/telugu/india-45079987 |accessdate=6 December 2018 |work=BBC News తెలుగు |date=6 August 2018}}</ref>
 
అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.<ref name="ఆంధ్రజ్యోతిలో జయశంకర్ ఇంటర్వ్యూ">{{cite news |last1=కొత్తపల్లి |first1=జయశంకర్ |title=తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ |url=http://www.andhrajyothy.com/artical?SID=197726 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=20 January 2016 |language=te}}</ref> తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
[[2004]] ఎన్నికలలో [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి గెలుపొందాడు.<ref name="autogenerated2">http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083</ref>. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, [[ఆలె నరేంద్ర]] కేంద్ర మంత్రులయ్యారు.<ref>{{cite web|title=Politics of separation|url=http://www.frontline.in/static/html/fl2215/stories/20050729003303700.htm|work=Frontline|accessdate=24 February 2014}}</ref> [[2004]] నుండి [[2006]] వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/Telangana-isn-t-scary/H1-Article1-485141.aspx|title=Telangana isn’t scary|work=hindustantimes.com|publisher=Hindustan Times|date=10 December 2009|accessdate=2011-06-30}}</ref> ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.జీవన్ రెడ్డి]]పై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. [[2008]]లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.
పంక్తి 137:
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ ఉద్యమకారులు]]
[[వర్గం:మెదక్ జిల్లా వ్యక్తులు]]