"దేవులపల్లి రామానుజరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
ట్యాగు: 2017 source edit
చి (AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
 
== సాహితీ సేవలు ==
మే 23, 1943 న ఏర్పడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్తుతో ఆయనకు మొదటి నుంచి అనుబంధం ఉంది. 1944లో దానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1947లో కార్యదర్శి అయ్యాడు. 1952లో తొలిసారి అధ్యక్షుడై మధ్యలో కొంత విరామం తప్ప చనిపోయేదాకా అధ్యక్షుడిగా వ్యవరించాడు. ఆయన సారథ్యంలో సారస్వత పరిషత్తు స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసింది. 1953 లో అలంపురంలో ఆయన నిర్వహించిన [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] సప్తమ వార్షికోత్సవాలకు హైదరాబాదు నుంచి ప్రత్యేకమైన రైలు నడిపారు. అప్పటి ఉపరాష్ట్రపతి [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] ఈ సమావేశాలను ప్రారంభించడమే కాక రెండు రోజులపాటు హాజరయ్యారు.
 
నిజాం హయాంలో తెలుగులో విద్యాబోధన జరిగేది కాదు. అటువంటి సమయంలో ఈయన సారస్వత పరిషత్తు ద్వారా తెలుగులో ప్రవేశ, విశారద లాంటి పరీక్షలు నిర్వహించేవారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు ఉపాధ్యాయుల కొరతను తీర్చగలిగారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ప్రాథమిక పాఠశాలల్లోనూ, విశారద పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించేవారు.
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2644665" నుండి వెలికితీశారు