మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 40:
==వ్యక్తిగత జీవితం==
వీరు 1885 జనవరి 22 ([[తారణ]] సంవత్సర [[మాఖ శుద్ధ షష్ఠి]]) న [[కృష్ణా జిల్లా]], [[నందిగామ]] తాలూకా [[పొక్కునూరు]]<nowiki/>లో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేనమామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మీబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.<ref>ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.</ref> 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
 
 
==రచనారంగం==
Line 48 ⟶ 47:
=== ఆంధ్రోద్యమం ===
[[తెలంగాణా]] ప్రాంతంలో [[నిజాం]] పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]]ను నెలకొల్పారు. రాజకీయ రంగంలో మాడపాటి వారిది మితవాదధోరణి. ఆయన తోటి ప్రజాసేవకులతో పాటు ఆయన గురించి కూడా తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించడం, వాదించడం, నచ్చజెప్పడం వంటివే వారి రాజకీయ పరికరాలని, వారి ప్రజానాయకత్వంలో ఆందోళనలు, ఉద్యమాలు, వ్యతిరేకించడం వంటివి లేవని తర్వాతి తరం నేతలు పేర్కొన్నారు. అయితే కొందరు చరిత్రకారులు వారి పాత్ర గురించి తెలియజేస్తూ తర్వాతి తరం వారు అతివాదులై తీవ్రకృషిచేయడానికి వీరి మితవాద నాయకత్వమే పునాది అని, 1920ల్లో వీరు చేసిన కృషిని తర్వాతి వారు మితవాదమన్నా అప్పటికి అదే అతివాదమని వివరించారు. మాడపాటి హనుమంతరావును భిన్న రాజకీయ దృక్పథాలు, వేర్వేరు సిద్ధాంత ప్రాతిపాదికలు ఉన్నవారు కూడా గౌరవించేవారు. తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన తొలియత్నాలే కారణం కావడమే వారి పట్ల ఆ గౌరవానికి కారణం. ఆయన ఆంధ్రమహాసభకు పెద్దదిక్కువలె వ్యవహరించేవారు. నిజాం ప్రభుత్వ విధానాల కారణంగా తెలంగాణలో తెలుగుభాష దెబ్బతింటున్నప్పుడు ఆయన తెలుగుభాష, తెలుగు సంస్కృతి వికాసానికి ఎనలేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు.<ref name="నా జీవితపథంలో">{{cite book|last1=రావి|first1=నారాయణరెడ్డి|title=నా జీవితపథంలో}}</ref><br />ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref>
 
 
=== గ్రంథాలయోద్యమం ===
ఆయన గ్రంథాలయోద్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు. ఈ క్రమంలో ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. హైదరాబాద్‌లోని [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]], [[హనుమకొండ]]<nowiki/>లోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. వీటిలో [[శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా చారిత్రిక ప్రశస్తి పొందింది. గ్రంథాలయాల ద్వారానే చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది.
 
 
=== విద్యారంగం ===
Line 63 ⟶ 60:
 
మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని [[శాసనసభ]]<nowiki/>కు 1952లో పోటీచేశారు. కాకుంటే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
 
 
== విమర్శలు ==
Line 99 ⟶ 95:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:గ్రంథాలయోద్యమ నేతలు]]
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు