నరసాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== చరిత్ర ==
నరసాపుర పేటగా చరిత్రలో కనిపించే ఈ పట్టణానికి శతాబ్దాలుగా ప్రాధాన్యత ఉంది. 17వ శతాబ్దిలో నరసాపురంలో భారీ ఎత్తున నౌకా నిర్మాణం సాగేది. అప్పట్లో నౌకా నిర్మాణం ఇక్కడ ఒక పరిశ్రమగా వర్ధిల్లింది.<ref name="RaychaudhuriHabib19822">{{cite book|author1=Tapan Raychaudhuri|author2=Irfan Habib|author3=Dharma Kumar|title=The Cambridge Economic History of India: Volume 1, C.1200-c.1750|url=https://books.google.com/books?id=L-s8AAAAIAAJ&pg=PA313|year=1982|publisher=CUP Archive|isbn=978-0-521-22692-9|pages=313–}}</ref> ప్రత్యేకించి 1580 నుంచి 17వ శతాబ్ది మధ్యభాగం వరకూ నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగం అని సంజయ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నాడు. కలప, ఇనుము, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడంతో పాటు చవకగా పనిచేసేందుకు మనుషులు దొరుకుతూండడం కూడా ఈ ప్రాంతంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. అక్కడ భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.<ref>{{citation|author=W.H. Moreland|title=Relations of Golconda in the Early Seventeenth Century|url=https://books.google.com/books?id=lggkDwAAQBAJ&pg=PA10|date=15 May 2017|publisher=Taylor & Francis|isbn=978-1-317-06825-9}}</ref>
 
==జనవిస్తరణ==
"https://te.wikipedia.org/wiki/నరసాపురం" నుండి వెలికితీశారు