జాన్ డాల్టన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1844 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చంద్రుడిపై క్రేటర్ కు డాల్టన్ పేరు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
|signature =John Dalton Signature c1827.svg|240px
}}
ద్రవ్యం, పరమాణువులు, రసాయనిక చర్యలపై అనేక పరిశోధనలు చేసి [[అణు సిద్ధాంతం|ఆధునిక పరమాణు సిద్ధాంతానికి]] పునాదులు వేసిన శాస్త్రవేత్త, '''జాన్ డాల్టన్'''. [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]] అభివృద్ధికి, పదార్థాలన్నింటికీ విద్యుత్‌ ధర్మం ఉందనడానికి, అణుశక్తి వినియోగానికి డాల్టన్‌ పరమాణు సిద్ధాంతమే బాటలు పరిచింది. ఈయన [[వాతావరణ శాస్త్రం]], [[వర్ణాంధత్వం]] మీద కూడా పరిశోధనలు చేశాడు.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణి ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాదు|pages=10}}</ref> అణు సిద్ధాంతానికి ఆధునికతను సమకూర్చినవాడుగా [[చంద్రుడు|చంద్రుడి]] మీద ఒక క్రేటర్ కు ఈయన పేరు పెట్టారు.
 
[[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]<nowiki/>లోని ఈగల్స్‌ ఫీల్డ్‌ గ్రామంలో ఓ పేద చేనేత కార్మికుడి అయిదుగురి సంతానంలో ఒకడుగా 1766 సెప్టెంబరు 6న పుట్టిన డాల్టన్‌ చిన్నతనంలోనే సైన్స్‌, గణితం, ఇంగ్లిషుల్లో పట్టు సాధించాడు. వాతావరణ శాస్త్రం (మెట్రియాలజీ)పై ఆసక్తి పెంచుకుని పరిశీలనకు కావలసిన పరికరాలను స్వయంగా రూపొందించుకున్నాడు. వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ లాంటి విషయాలను రోజూ నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించి జీవితాంతం కొనసాగించాడు. చనిపోయే చివరి రోజు వరకు ఆయన నమోదు చేసిన అంశాలు 2 లక్షల పైమాటే! స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడం, తండ్రికి సాయపడడంతో పాటు లాటిన్‌, గ్రీకు భాషలు నేర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/జాన్_డాల్టన్" నుండి వెలికితీశారు