క్వాంటం సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
2. ఒక ఉపమానం
 
విగతులని ఉహించుకుందుకి ఒక “తిరకాసు భవనం” ఉపమానం చెబుతాను. ఈ తిరకాసు భవనం మొదటి అంతస్థులో ఒకే ఒక గది ఉంటుంది. ఈ గది మీద 1s అని రాసి ఉంటుంది. ఆ గదిలో ఒక మంచం. ఆ మంచం మీద రెండు ఎలక్ట్రానులు పడతాయి - ఒకటి ఊర్ధ్వ ముఖం తోటి {{math|1s<sup>1</sup>}}, ఒకటి అధో ముఖం తోటి {{math|1s<sup>2</sup>}} ఈ గది అట్టడుగున ఉంటుంది కనుక ఇది చాల తక్కువ శక్తి స్థానంలో ఉంటుంది.
 
“తిరకాసు భవనం” రెండవ అంతస్థులో రెండు వసారాలు ఉంటాయి. మొదటి వసారాలో ఒక గది, ఆ గది మీద {math|2s} అని రాసి ఉంటుంది. రెండవ వసారాలో మూడు గదులు ఉంటాయి, వాటి మీద {{math|2p<sub>"x"</sub>}}, {{math|2p<sub>"y"</sub>}}, {{math|2p<sub>"z"</sub>}} అని రాసి ఉంటాయి. ఒకొక్క గదిలో ఒకొక్క మంచం, ఒకొక్క మంచం మీద రెండేసి ఎలక్ట్రానులు - ఒకటి ఊర్ధ్వ ముఖం తోటి, ఒకటి అధో ముఖం తోటి ఉంటాయి. ఈ రెండవ అంతస్తు మొదటి అంతస్తు కంటే ఎక్కువ శక్తి స్థానంలో ఉంటుంది.
 
“తిరకాసు భవనం” మూడవ అంతస్థులో మూడు వసారాలు ఉంటాయి. మొదటి వసారాలో ఒక గది, ఆ గది మీద 3s అని రాసి ఉంటుంది. రెండవ వసారాలో మూడు గదులు ఉంటాయి, వాటి మీద (3p_x, 3p_y, 3p_z) అని రాసి ఉంటాయి. మూడవ వసారాలో 5 గదులు ఉంటాయి, వాటి మీద (3d_1, 3d_2, 3d_3, 3d_4, 3d_5) అని రాసి ఉంటాయి. ఒకొక్క గదిలో ఒకొక్క మంచం, ఒకొక్క మంచం మీద రెండేసి ఎలక్ట్రానులు - ఒకటి ఊర్ధ్వ ముఖం తోటి, ఒకటి అధో ముఖం తోటి ఉంటాయి. ఈ మూడవ అంతస్తు రెండవ అంతస్తు కంటే ఎక్కువ శక్తి స్థానంలో ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/క్వాంటం_సంఖ్య" నుండి వెలికితీశారు