క్వాంటం సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
[[అణువు]] (atom) నిర్మాణ శిల్పం అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల నమూనాలు వాడుకలోకి వచ్చేయి. వీటిల్లో ముందుగా ప్రాచుర్యం లోనికి వచ్చినది [[నీల్స్ బోర్]] ప్రతిపాదించిన నమూనా. ఈ బోర్ నమూనాలో అణుగర్భంలో ఒక కేంద్రకము (nucleus), దాని చుట్టూ ఎలక్ట్రానులు[[ఎలక్ట్రాను]]లు నిర్దిష్టమైన దూరాలలో ప్రదక్షణాలు చేస్తూ ఉంటాయి. తక్కువ శక్తి గల ఎలక్ట్రానులు కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష్యల (orbits) వెంబడి, ఎక్కువ శక్తి ఉన్న ఎలక్ట్రానులు కేంద్రకానికి దూరంగా ఉన్న కక్ష్యల వెంబడి ప్రదక్షణలు చేస్తూ ఉంటాయి. అందుకని ఈ కక్ష్యల దూరాలని n = 1, 2, 3,... అనుకుంటూ సూచించడం ఆచారం అయిపోయింది. ఈ n ని మొదటి గుళిక (క్వాంటం) సంఖ్య అంటారు. కనుక n విలువ తెలిస్తే ఎలక్ట్రాను ఎంత శక్తివంతమైన స్థితిలో ఉందో తెలుస్తుంది.
 
ఎలక్ట్రాను పరిస్థితి (state) ని వర్ణించడానికి అది ఎంత శక్తివంతంగా ఉందో చెప్పినంత మాత్రాన సరిపోదు. (ఒక మనిషిని వర్ణించాలంటే ఆ మనిషి పొడుగు, బరువు, జుత్తు రంగు, కళ్ళ రంగు, వగైరాలు ఎలా కావాలో అదే విధంగా ఒక ఎలక్ట్రాను స్థితిని వర్ణించడానికి అది కేంద్రానికి ఎంత దూరంలో ఉందో (అనగా, n విలువ) చెప్పాలి, ఎంత జోరుగా ప్రదక్షిణం చేస్తున్నాదో (అనగా, కోణీయ వేగం, l విలువ) చెప్పాలి, అదే విధంగా అయస్కాంత కదలిక ( m విలువ), ఆ చేసే ప్రదక్షిణంలో భ్రమణం (spin) ఉందో లేదో (s విలువ), వగైరా చెప్పాలి కదా! వీటన్నిటిని (అనగా, n, l, m, s, వగైరా) కలిపి గుళిక సంఖ్యలు (quantum numbers) అంటారు.
పంక్తి 8:
గుళిక వాదంలో గతి (orbit), విగతి (orbital), శక్తి స్థానం (energy level), కోశం (shell) అనే మాటలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. స్థూలంగా ఈ మాటలు అన్నీ దరిదాపుగా ఒకే భావాన్ని చెబుతాయి. సూక్ష్మంగా ఈకలు పీకితే చిన్న చిన్న తేడాలు కనబడతాయి. ఒకే భావానికి ఇన్ని మాటలు ఉండడానికి కారణం ఏమిటంటే మొదట్లో ఈ భావాలు సమగ్రంగా మన అవగాహనలోకి రాలేదు. ఇప్పుడు అవగాహన పెరిగింది కానీ బంకనక్కిరికాయల్లా ఈ పాత మాటలు మనని పట్టుకు వేలాడుతున్నాయి. ఇప్పుడు పొమ్మంటే పోవు. పుస్తకాలు అన్నీ తిరగ రాయడం సాధ్యమా?
 
గుళిక వాదంలో తారసపడే సాంకేతిక పదం “గతి” ఇంగ్లీషులో “ఆర్బిట్” (orbit) తో సమానం. సౌర కుటుంబంలో[[సౌరకుటుంబం]]లో గ్రహ గతులని “ఆర్బిట్” లు అంటారు. (వీటిని తెలుగులో కక్ష్యలు అని కూడా అంటారు.) ఇవి ఒకే తలంలో ఉండే గ్రహ సంచార రేఖలు. ఇదే విధంగా ఎలక్ట్రానులు కూడా ఒక కేంద్రకం చుట్టూ ఒక నియమితమైన తలంలో, ఒక నియమితమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాయని మనం ఊహించుకుంటే అప్పుడు ఎలక్ట్రాను ప్రయాణించే మార్గాన్ని కూడా “గతి” అనో, “కక్ష్య” అనో పిలవచ్చు. (An orbit is a planar or two-dimensional circular pathway. An orbit follows Newton’s laws of motion.) అనగా, గతి అనే దానిని ఊహించుకోవాలంటే ఒక తీగకి పూసని గుచ్చి, ఆ తీగని గుండ్రంగా అమర్చినప్పుడు తీగ “గతి” అవుతుంది, పూస ఎలక్ట్రాను అవుతుంది.
 
కానీ ఆధునిక [[గుళిక వాదం]], ప్రత్యేకించి [[హైజన్బర్గ్]] [[అనిర్దిష్ట సూత్రం]] (Uncertainity Principle), ప్రకారం ఎలక్ట్రాను ఫలానా మార్గం వెంబడి ప్రయాణిస్తున్నదని నిర్ధారించి చెప్పలేము. కనుక గుళిక వాదంలో “ఆర్బిట్” (గతి, కక్ష్య) అన్న మాటకి అర్థం లేదు. గుళిక వాదంలో ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశం విస్తృతం, త్రి-మితీయం (3-dimensional) కనుక ఇలా “వికసించిన” ప్రదేశాన్ని సూచించడానికి ఇంగ్లీషులో “ఆర్బిటల్” అని కొత్త పేరు సృష్టించేరు. “విస్తరించిన గతి” లేదా “వికసించిన గతి” కనుక దీనిని మనం తెలుగులో “విగతి” అనొచ్చు. దీనిని తెలుగులో కర్పరం అని కూడా అంటారట!
 
ఒక త్రి-మితీయ ప్రదేశంలో ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశాన్ని విగతి అన్నాం కదా. ఇది త్రి-మితీయ ప్రదేశంలో ఉంది కనుక ఒక ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశానికి పొడుగు, వెడల్పు, లోతు ఉంటాయి. అనగా ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశం మేఘం రూపంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. ఈ మేఘం కూడా - దాంట్లో నిక్షిప్తమైన శక్తిని బట్టి - రకరకాల బుడగలు రూపంలో ఉంటుందని కూడా మనం ఊహించుకోవచ్చు. ఈ బుడగ రూపాలనే ఇంగ్లీషులో “ఆర్బిటల్స్” అంటారు, తెలుగులో “విగతులు” అంటున్నాం. అనగా, విగతి అనేదానిని ఊహించుకోవాలంటే రబ్బరు బుడగ ఆకారం ఒక విగతి అవుతుంది, రెండు బుడగలని ఊది, వాటి మూతుల దగ్గర ముడి వేస్తే వచ్చే ఆకారం మరొక విగతి అవుతుంది. మూడు బుడగలని ఊది, వాటి మూతుల దగ్గర ముడి వేస్తే వచ్చే ఆకారం మరొక విగతి అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/క్వాంటం_సంఖ్య" నుండి వెలికితీశారు