క్వాంటం సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{in use}}
==ఉపోద్ఘాతం==
[[File:Bohr_atom_model.svg|right|thumb|బోర్ నమూనానమూనాలో ఎలక్ట్రానుల గతులు]]
[[అణువు]] (atom) నిర్మాణ శిల్పం అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల నమూనాలు వాడుకలోకి వచ్చేయి. వీటిల్లో ముందుగా ప్రాచుర్యం లోనికి వచ్చినది [[నీల్స్ బోర్]] ప్రతిపాదించిన నమూనా. ఈ బోర్ నమూనాలో అణుగర్భంలో ఒక కేంద్రకము (nucleus), దాని చుట్టూ [[ఎలక్ట్రాను]]లు నిర్దిష్టమైన దూరాలలో ప్రదక్షణాలు చేస్తూ ఉంటాయి. తక్కువ శక్తి గల ఎలక్ట్రానులు కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష్యల (orbits) వెంబడి, ఎక్కువ శక్తి ఉన్న ఎలక్ట్రానులు కేంద్రకానికి దూరంగా ఉన్న కక్ష్యల వెంబడి ప్రదక్షణలు చేస్తూ ఉంటాయి. అందుకని ఈ కక్ష్యల దూరాలని {{mvar|n|size=120%}}= 1, 2, 3... అనుకుంటూ పూర్ణాంకాలుగా సూచించడం ఆచారం అయిపోయింది. ఈ {{mvar|n|size=120%}} ని మొదటి గుళిక (క్వాంటం) సంఖ్య అంటారు. కనుక {{mvar|n|size=120%}} విలువ తెలిస్తే ఎలక్ట్రాను ఎంత శక్తివంతమైన స్థితిలో ఉందో తెలుస్తుంది. ఇది కక్ష్య సైజుని (పరిమాణంని), లేదా శక్తి స్థాయిని సూచిస్తుంది. ఈ {{mvar|n|size=120%}} విలువ పెరిగే కొద్ది కక్ష్య సైజు, శక్తి పెరుగుతాయి. ఈ {{mvar|n|size=120%}} విలువ 1 నుండి బాహ్య ఎలక్ట్రాన్ కలిగి వున్న స్థాయి వరకు ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/క్వాంటం_సంఖ్య" నుండి వెలికితీశారు