బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

2,530 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==సంక్షిప్త చిత్రకథ==
జమిందారు సురేంద్రకు ఆస్తి వుంది. పుస్తక పరిజ్ఞానం వుంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్న మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠాలు చెప్పే ఉద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమె పట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.
 
తరువాత సురేంద్ర తన జమిందారీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్యకు అహంకారం ఎక్కువ. అక్కడ పనిచేసే గుమస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే గుమస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర "మాధవీపురం" గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా లెక్కచేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి, ఆమెను కలుసుకొని, క్షమాపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/264949" నుండి వెలికితీశారు