ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
'''ఇల్లరికం ''', 1959లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇల్లరికపు అల్లుళ్ళకు తప్పని అగచాట్లు, వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడచే కథ ఇది. [[రజతోత్సవం]] జరుపుకున్న చిత్రం. ఇందులో పాటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి. "ఇల్లరికంలో ఉన్న మజా" అనే పల్లవి సంభాషణలలో భాగమయ్యింది.
==కథ==
జమీందారు (గుమ్మడి) సుందరమ్మ (హేమలత)ల ఏకైక కుమార్తె రాధ (జమున). వడ్డీ వ్యాపారి ధర్మయ్య మేనల్లుడు వేణు (ఏఎన్నార్). కాలేజీ వార్షికోత్సవంలో ఇద్దరూ పోటీ పడతారు. తరువాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. సుందరమ్మ పెద్ద తల్లి కొడుకు గోవిందయ్య (సీఎస్సార్) దురాశపరుడు. ఆస్తిపాస్తుల పట్ల మక్కువగల సుందరమ్మ ఆస్తిపరుడైన అల్లుడు కావాలని కోరుకుంటుంది. కాని జమీందారు మాత్రం కూతురు రాధ ఇష్టప్రకారం పేదవాడైనా సంస్కారవంతుడైన వేణుతో పెళ్లి జరిపిస్తాడు. అతన్ని ఇల్లరికం తెచ్చుకొని ఆఫీసు బాధ్యతలు అప్పగిస్తాడు జమీందారు. గోవిందయ్య కొడుకు శేషగిరి (ఆర్ నాగేశ్వర రావు) వ్యసనపరుడు, మోసకారి. పట్నంలో వేణు చెల్లెలు దుర్గ (గిరిజ)ను గుడిలో పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తుంటాడు. శేషగిరిని అక్కడనుంచి తీసుకొచ్చి రాధకు భర్తగా చేయాలనే ఆశ ఫలించలేదన్న కోపంతో ఉంటాడు గోవిందయ్య. అల్లుడు పేదవాడని సుందరమ్మకు బాధ. దీంతో రాధ, వేణుల మధ్య కలతలు రేపాలని ప్రయత్నిస్తుంటారు. రాధ, వేణులు అనురాగంతో కాపురం చేస్తుండగా, భర్త వదిలేయటంతో నాట్య ప్రదర్శనలు ఇస్తున్న దుర్గను వేణు కలుస్తాడు. తనెవరో భార్యకు తెలియనీయవద్దన్న చెల్లెలి కోరుతుంది. అదే సమయంలో జమీందారు -తన సోదరి (టిజి కమలదేవి)కి డబ్బు సాయం చేయమని వేణుతో 10 వేల రూపాయలు పంపుతాడు. అయితే ఈ విషయం రాధకు తెలియనీయకూడదని అంటాడు. తరువాత విషయం తెలుసుకున్న రాధ కోపంతో, ఆస్తి తనపేర వ్రాయించిన భర్తను అవమానిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగి వారి కాపురంలో అశాంతి మొదలవుతుంది. జమీందారు మరణించటం, వేణు సహనంతో భార్యలో మార్పుకోసం ప్రయత్నిస్తాడు. చివరకు రాధకు నిజాలు తెలుస్తాయి. అదే సమయంలో శేషగిరి ఆమెను బంధించటంతో, వేణు మారువేషంలో వెళ్లి రక్షిస్తాడు. చివరకు వేణు చెల్లెలు దుర్గ అని గోవిందయ్యతో సహా అంతా తెలుసుకుని క్షమాపణ కోరడంతో సినిమా శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @50 ఇల్లరికం |url=http://www.andhrabhoomi.net/content/flashback50-56 |accessdate=29 April 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=27 April 2019}}</ref>.
 
ప్రక్క ఇళ్ళలో ఇల్లరికం ఉన్న పేకేటి శివరాం, రేలంగిలు ఈ సినిమాలో హాస్యం పంచుతారు.
 
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు