హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగులో ఉదజని అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> బణు (H<sub>2</sub>) [[వాయువు]] (molecular gas). 1.00794 గ్రా/[[మోల్]] యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన [[మూలకము]] మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలి కంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కావెండిష్కేవెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]]లో [[ఉదజని]]ని మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో కలిపిన చర్య జరిపిద్వారా తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము (నీరు) ను ఇస్తోంది కాబట్టి దీనిని తెలుగులో ఉదజని అని అంటారు. ఇంగ్లీషులో "హైడ్రొజన్" అన్న మాట ఉదకమును పుట్టించేది అనే అర్థాన్ని ఇస్తుంది.
 
== లక్షణాలు ==
* హైడ్రోజన్ అణువు తన [[అణు కేంద్రకం|కేంద్రకం]] కన్నా 145 వేల రెట్లు పెద్దది.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాద్|pages=49}}</ref>
* హైడ్రోజన్ అణువు [[అణు కేంద్రకం|కేంద్రకం]] లో [[ప్రోటాను]] అనే పరమాణువు ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ [[ఎలక్ట్రాను]] అనే మరొక పరమాణువు ప్రదక్షిణాలు చేస్తూన్నట్లు [[బోర్ నమూనా]]లో ఊహించుకుంటాం.
* ఉదజని అణువు ఎంత పెద్దగా ఉంటుంది? ఉదజని అణువు గుండ్రంగా బంతిలా ఉంటుందని ఊహించుకుంటే ఆ బంతి వ్యాసార్ధాన్ని "బోర్ వ్యాసార్ధం" అంటారు. ఈ బోర్ వ్యాసార్ధం విలువ 0.529 × 10-10 [[మీటర్లు]]. అనగా, ఉరమరగా, అర [[:en:angstrom|ఏంగ్‌స్ట్రం]] ఉంటుంది.
 
== ఉపయోగాలు ==
=== పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ ===
* హేబర్ పద్ధతిలో [[అమ్మోనియా]] సంశ్లేషణ: 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం [[ఉత్ప్రేరకం]] సమక్షంలో నైట్రోజన్ వాయువు, ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు