ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
==సినీ జీవితం==
===2006-2007 : సినిమాల్లోకి తెరంగేట్రం===
అరుణనట శిక్షకులు [[ఎన్.జె. భిక్షు]], దగ్గరఅరుణ కొంతకాలంబిక్షు దగ్గర నటనలో శిక్షణ పొందినతీసుకున్నది.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> ఆ తర్వాత 2006లో ఇలియానా [[వై.వి.యస్.చౌదరి]] దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[మహేష్ బాబు]] సరసన [[పోకిరి]] సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖపేరొందిన నటిగా అవతరించింది.
 
ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో [[తమిళ]] సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన [[ఖతర్నాక్]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన నటించిన [[రాఖీ (2006 సినిమా)|రాఖీ]] మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో [[ప్రభాస్]] సరసన నటించిన [[మున్నా]] చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా [[తెలుగు]] సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.
పంక్తి 28:
 
===2012-ప్రస్తుతం : హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం===
2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది ప్రముఖ హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] సరసన [[జులాయి]] చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అదే ఏడాది రవితేజ సరసన [[దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా)|దేవుడు చేసిన మనుషులు]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఇందులో రవితేజ మరియూ ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి.
 
ఆ ఏడాది ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హింది సినిమల్లోకి అడుగుపెట్టింది. రణబీర్ కపూర్, [[ప్రియాంక చోప్రా]] ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇందులో ఇలియానా పోషించిన శృతి పాత్రకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకున్న ఇలియానా అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డ్ ను గెలుచుకుంది. ప్రస్తుత తరం కథానాయికల్లో [[ఆసిన్]], [[కాజల్ అగర్వాల్]] తర్వాత తొలిచిత్రంతోనే భారీ విజయం అందుకున్న దక్షిణాది కథానాయికగా ఇలియానా కొనియాడబడింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో నటిస్తోంది ఇలియానా.
"https://te.wikipedia.org/wiki/ఇలియానా" నుండి వెలికితీశారు