సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
imdb_id = 0086231
}}
'''సాగరసంగమం''' కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. కమలహాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]] పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు. ఇందులో కమలహాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు.
'''సాగరసంగమం''', జూన్ 3, 1983 లో విడుదలైన ఒక తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన [[శంకరాభరణం]] చిత్రం విజయనంతమైన నేపథ్యంలో సంగీత, నృత్య కథాత్మక చిత్రాలకు ఆదరణ హెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. [[కాశీనాధుని విశ్వనాధ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో[[కమల్ హాసన్]] మరియు [[జయప్రద]] జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో [[శరత్ బాబు]] మరియు ప్రముఖ గాయని [[శైలజ]] నటించారు. స్వరకల్పన [[ఇళయరాజా]]. ఇది తమిళంలో "సాలంగై ఓలి" అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది. ఈ సినిమా కోసం వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు ఎప్పటికీ నిలిచిపోయే ఆణిముత్యాలు.
 
ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో '''సలంగై ఒలి''' ('''మువ్వల సవ్వడి''' అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో '''సాగర సంగమం''' అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది. రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి సినిమా కూడా ఇదే.
విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలలో ఇది ఒకటి. [[స్వాతిముత్యం]] మరియు [[శుభ సంకల్పం]] తక్కిన రెండు చిత్రాలు.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు