సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

→‎నటీనటుల ఎంపిక: చిత్రీకరణ
పంక్తి 53:
 
కథానాయకుడి పాత్రకు కమల్ హాసన్ ని సంప్రదించగా అతడు నిరాకరించాడు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత అలంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన "కడల్ మీన్గళ్" అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో హాసన్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది. ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించాడు. కథానాయికగా ముందుగా [[జయసుధ]]<nowiki/>ను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో [[జయప్రద]]<nowiki/>ను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] చెల్లెలు [[ఎస్.పి.శైలజ]]<nowiki/>ను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు. అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}}
 
=== చిత్రీకరణ ===
 
ఈ సినిమాను [[మద్రాసు]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]] మరియు [[ఊటీ]]<nowiki/>లో చిత్రీకరించారు. "వేవేల గోపెమ్మలా" పాటను విశాఖపట్నంలోని [[భీమిలి]] బీచులోనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}} జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, "మౌనమేలనోయి" పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాల్నీ విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. "ఓం నమఃశివాయ" పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని [[ఈనాడు]] కార్యాలయంలో చిత్రీకరించారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}}
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు