కెన్యా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 304:
కెన్యాలో (ప్రత్యేకంగా మాసైలో) "బిగ్ ఫైవ్" అనే వేటమృగాలు సింహం, చిరుత, గేదె, ఖడ్గమృగం, ఆఫ్రికా ఏనుగు అధికంగా కనిపిస్తాయి. ఆట జంతువులు కెన్యా మరియు ప్రత్యేకంగా మాసాయి మారా లో చూడవచ్చు. దేశంలో జాతీయ ఉద్యానవనాలు, గేమ్ రిజర్వులలో ఇతర అడవి జంతువులలో సరీసృపాలు, పక్షులు గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. జూన్ - సెప్టెంబరు మధ్య వార్షిక జంతువుల వలసలు మిలియన్ల సంఖ్యలో జంతువులతో పాల్గొనడం విలువైన విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వలసలు పొరుగున ఉన్న టాంజానియాలోని సెరెంగెటి నుండి కెన్యాలోని మాసై మరాకు వరకు 2 మిలియన్ల జంతువులతో దాదాపు 2,900 కి.మీ దూరం సాగుతుంది.<ref>{{cite web|title=Masai Mara|url=http://www.kenyatraveltips.com/masai-mara-safari.html}}</ref> 2,900 కి.మీ (1,802 మై) దూరం రెండు మిలియన్ల జంతువులు ప్రయాణిస్తూ ఆహారం, నీటి సరఫరా కోసం వెతుకుతూ నిరంతరం సవ్యదిశలో ప్రయాణిస్తాయి. ఈ సెరెంగెటి వలసలు ఆఫ్రికా ఏడు ప్రకృతి అద్భుతాల జాబితాలో ఒకటిగా ఉంది.
===ఆర్ధికరంగం===
[[File:Kenya Export Treemap.jpg|thumb|upright=1.6|A proportional representation of Kenya's exports.]]
కెన్యా మైక్రో ఎకనమికు దృక్పథం గత కొన్ని దశాబ్దాలలో స్థిరంగా వృద్ధి చెందింది. అయినప్పటికీ ఈ వృద్ధిలో ఎక్కువ భాగం నగదు సామాన్య కెన్యన్లకు సూక్ష్మ ఆర్ధిక స్థాయి ఋణాలుగా మళ్ళించబడింది. నిధులు సూక్ష్మఋణాల పేరుతో సాధారణ తక్కువ, మధ్య-ఆదాయ గృహాలు, చిన్న వ్యాపారాలు, దేశవ్యాప్తంగా విస్తారమైన కష్టాలను ఎదుర్కొంటున్న, అసంతృప్తి స్ట్రైకులు, పికెటింగులకు ముఖ్యంగా దాడులకు పాల్పడుతున్న ప్రజలకు మళ్ళించబడడంతో స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధ్యం చేయబడింది. 2014 లో దేశం జి.డి.పి.ఎగువ స్థాయికి సర్దుబాటు చేయబడింది. ఇది తక్కువ-మధ్య-ఆదాయం గల దేశంగా వర్గీకరించబడింది.
|