సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

→‎నటీనటుల ఎంపిక: చిత్రీకరణ
link
పంక్తి 25:
 
==కథ==
నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. బాలకృష్ణ ([[కమల్ హాసన్]]) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. [[కూచిపూడి]], [[భరతనాట్యం]], [[కథక్]] రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి ([[జయప్రద]]) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. [[ఢిల్లీ]]లో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి ([[డబ్బింగ్ జానకి]]) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి అంతకు మునుపే పెళ్ళవుతుంది. వీరి ప్రేమ గుర్చి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు .అతను సమర్డించినప్పతటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పేడతాడు. తల్లి మరణం,ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనతభావంతో బాలకృష్ణ దాదాపు తాగుబోతు అవుతాడు.
 
తరువాతి భాగంలో మాధవి కూతురు ([[శైలజ]])కు బాలకృష్ణ గురువౌతాడు నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు.ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు మరియు తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు