నేల ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
{{Taxobox
| name = నేల ఉసిరి
| image = Quebra-Pedra. Phyllanthus niruri 03520.JPGjpg
| image_width = 230px
| image_caption =
పంక్తి 19:
 
'''నేల ఉసిరి''' ([[లాటిన్]] ''Phyllanthus niruri'') ఒక ఔషధ మొక్క. ఇది [[ఫిలాంథేసి]] (Phyllanthaceae) కుటుంబానికి చెందినది. దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు మరియు తెలుపు అని రెండు రకాలు.
 
==పరిచయం==
చిన్న మొక్కల్నించి, మహావృక్షాల వరకూ అనేకానేక ప్రయోజనాలు, ఔషధగుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప, పనికిరానిదంటూ ప్రకృతిలో తొంబై తొమ్మిది శాతం ఉండనేవుండదు. కానీ వాటిని వినియోగించుకోవడంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం.మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూవుంటాం. అలాంటి కోవకి చెందినదే నేల ఉసిరి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తువరకూ పెరిగే చిన్ని మొక్క. దీని శాస్త్రీయనామం ఫిల్లాంథస్‌ అమారస్‌. ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క. సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. సంవత్సరం పొడవునా పెరిగే ఈ చెట్టు పత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పత్రాల కింది భాగంలో ఆకుపచ్చ తెలుపు కలిసిన రంగులో చిన్ని చిన్ని పువ్వులు పూస్తాయి. కాండము ఆకుపచ్చగా సన్నగా ఉండి నునుపుగా, మృదువుగా ఉంటుంది. దీనిలో విత్తనాలు పత్రాల కింది భాగంలో ఉండటం వల్ల దీనిని ఇంగ్లీషులో సీడ్‌ అండర్‌ లీఫ్‌ అనీ, స్టోన్‌ బ్రేకర్‌ అనీ అంటారు. ఇక ప్రాంతీయతని బట్టి అనేక భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. స్పైయిన్‌లో చంకా పిడ్రా, క్వబ్రా పీడ్రా అనీ, మన భారతీయ భాషల్లో - బెంగాలీలో భూయామ్లా, సదాహజురమణి అనీ, హిందీలో భూయి ఆవ్ల, జంగ్లీ ఆవ్ల అనీ, [[తెలుగు]]లో నేల ఉసిరి, నేల విరిక అనీ, [[తమిళం]]లో కీల నెల్లి, కిక్కాయ నెల్లి అనీ, [[మలయాళం]]లో కీఝర్‌ నెల్లి అనీ, [[మరాఠీ]]లో భూయి ఆవ్ల అనీ, [[కన్నడం]]లో నెలనెల్లి, కీరునెల్లి అని, [[గుజరాతీ]]లో భోన్యాన్‌వలి అనీ అంటారు. ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కన్నా, ఉత్తర భాగాన ఎక్కువగా పెరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/నేల_ఉసిరి" నుండి వెలికితీశారు