సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
=== చిత్రీకరణ ===
 
ఈ సినిమాను [[మద్రాసు]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]] మరియు [[ఊటీ]]<nowiki/>లో చిత్రీకరించారు. "వేవేల గోపెమ్మలా" పాటను విశాఖపట్నంలోని [[భీమిలి]] బీచులోనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}} [[జయప్రద]] ఇంట్లో జరిగే సన్నివేశాలు, "మౌనమేలనోయి" పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాల్నీ విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. "ఓం నమఃశివాయ" పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని [[ఈనాడు]] కార్యాలయంలో చిత్రీకరించారు. మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై [[కమల్ హాసన్]] నాట్యం చేసే "తకిట తథిమి" పాటను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. "నాదవినోదము" పాటను ఊటీలో తీశారు. [[వి. శాంతారాం]] తీసిన [[ఝనక్ ఝనక్ పాయల్ బాజే]], [[నవరంగ్]] సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన [[గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)|గోపికృష్ణ]] ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించాడు. అతడు ఈ పాట కోసమే ప్రత్యేకంగా [[బొంబాయి]] నుండి వచ్చాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}} పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాట చిత్రీకరణకు ముందు హాసన్ కు ఓ హిందీ సినిమా షూటింగులో కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో, నెలరోజులపాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు. ఆ తరువాత విడుదలకు ఆలస్యమవుతుందని పునః ప్రారంభించారు. అయితే, అప్పటికీ హాసన్ ఇంకా కోలుకోలేదు. అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడతడు. అయినప్పటికీ నృత్యం చేయడానికి పూనుకున్నాడు. "షాట్" అనగానే నృత్యం చేయడం, "కట్" అనగానే క్రింద పడిపోవడం. అలా, ఆ పాట పూర్తయింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}}
 
చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్టులో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు హాసన్ నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు [[కాశీనాథుని విశ్వనాథ్|విశ్వనాథ్]]<nowiki/>కి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా [[పండిట్ రవిశంకర్]] మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు హాసన్. విశ్వనాథ్ కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించాడు హాసన్.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}} జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని హసన్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం. అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని హాసన్ కు సైగ చేశాడు. అలా చెప్పిన వెంటనే హసన్ ఏడుపులోంచి నవ్వులోకి మారిపోయాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}}
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు