సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్టులో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు హాసన్ నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు [[కాశీనాథుని విశ్వనాథ్|విశ్వనాథ్]]<nowiki/>కి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా [[పండిట్ రవిశంకర్]] మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు హాసన్. విశ్వనాథ్ కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించాడు హాసన్.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}} జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని హసన్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం. అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని హాసన్ కు సైగ చేశాడు. అలా చెప్పిన వెంటనే హసన్ ఏడుపులోంచి నవ్వులోకి మారిపోయాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}}
 
[[శరత్ బాబు]]<nowiki/>తో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్రప్రసాద్]], నిర్మాత [[ఏడిద నాగేశ్వరరావు]] అడగడంతో ఈ సినిమాలో [[ఎస్.పి.శైలజ|శైలజ]] ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్ కు డబ్బింగ్ చెప్పాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}} జయప్రద భర్త పాత్ర పోషించిన [[మోహన్ శర్మ]]<nowiki/>కు గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] డబ్బింగ్ చెప్పాడు. "వేవేల గోపెమ్మలా" పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు