ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, లు కంటే → ల కంటే, నుండీ → నుండి using AWB
పంక్తి 26:
[[File:Methanol_Lewis.svg|thumb|150px|మెతనోల్]]
 
మెతల్ ఆల్కహాలులో ఉన్న ఈ (-OH) గుంపుని ఇంగ్లీషులో “హైడ్రాక్సిల్ గ్రూప్” (hydroxyl group) అంటారు. “హైడ్రొజన్”, “ఆక్సిజన్” అన్న మాటలని సంధించగా వచ్చింది ఈ హైడ్రాక్సిల్ అన్న పదం. ఒక పదార్థపు బణువులో కర్బనంతో పాటు ఈ హైడ్రాక్సిల్ గుంపు ఎప్పుడు ఉన్నా ఆ పదార్థాన్ని “ఆల్కహాలు” అనే పిలుస్తారు. అంటే, ఈ ఆల్కహాలు అనేది ఇంటిపేరు లాంటిది. ఒకే ఇంటిపేరుతో ఎంతోమంది మనుష్యులు ఉన్నట్లు, ఆల్కహాలు పేరుతో ఎన్నో రసాయనాలు ఉన్నాయి. మెతల్ గుంపు (-CH<sub>3</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే [[మెతల్ ఆల్కహాలు]] వస్తుంది. ఎతల్ గుంపు (-C<sub>2</sub>H<sub>5</sub>) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే [[ఎతల్ ఆల్కహాలు]] వస్తుంది. ఇదే బాణీలో [[ప్రొపైల్ ఆల్కహాలు]], [[బ్యుటైల్ ఆల్కహాలు]], … అలా ఎన్నో ఉన్నాయి.
 
ఈ మెతల్ ఆల్కహాలుని శాస్త్రీయపు భాషలో కాకుండా సామాన్యులు వాడే ఇంగ్లీషులో “ఉడ్ ఆల్కహాల్” (wood alcohol) అంటారు. (అంటే కర్రసారా అన్న మాట. కర్రలని ఆవంలో పెట్టి బట్టీ పడితే కర్రసారా వస్తుంది.) నిజానికి ఈ మెతల్ ఆల్కహాలుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీకు భాషలో “మెథీ” అంటే సారా, “హాల్” అంటే చిట్టడవి. ఇంగ్లీషులో చిట్టడవిని “ఉడ్” (wood) అంటారు. కనుక “మెతల్ ఆల్కహాల్”కి ఇంగ్లీషులో wood alcohol అని పేరు వచ్చింది కనుక తెలుగులో “అడవి సారా” అవాలి. కాని ఇంగ్లీషు వచ్చుననుకునే తెలుగు వాళ్లు “ఉడ్” అన్న మాటని “కర్ర” అని తెలిగించి దీనిని "కర్రసారా" అన్నారు. ఒక విధంగా "అడవి సారా" కంటే "కర్ర సారా" అన్న మాటే బాగుందనిపిస్తుంది.
పంక్తి 32:
ఒకే పదార్థానికి ఇన్నేసి పేర్లు ఉండటంతో ఒకరి మాట మరొకరికి అర్థం కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు శాస్త్రవేత్తలంతా జినీవాలో సమావేశమయి ఒక ఒప్పందానికి వచ్చేరు. ఈ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటికి పేరులో చివర “ఓల్” (-ol) శబ్దం రావాలన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మెతల్ ఆల్కహాలు పేరుని “మెతనోలు” (మెతనాలు కాదు) గా మార్చమన్నారు. ఉచ్చారణ దోషం లేకుండా పలకమన్నారు. వర్ణక్రమదోషం లేకుండా రాయమన్నారు. ఆల్కహాలుని ఆల్కహోలు అనక్కరలేదు కాని, మెతల్ ఆల్కహాలుని మెతనోల్ అనాలి. ఇదే విధంగా ప్రొపైల్ ఆల్కహాలుని ప్రొపనోల్ అనాలి. బ్యుటైల్ ఆల్కహాలు బ్యుటనోల్ అవుతుంది.
 
ఉచ్చారణ విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నానా అని మీరు అనుకోవచ్చు. ఆల్కహాలు అనే మాటని ఇంగ్లీషులో రాసినప్పుడు “ఒలంతం” (ఒతో అంతం అయేవిధంగా) రాసినా, మాట పలికేటప్పుడు “అలంతం” (అతో అంతం అవుతూన్నట్లు) గానే పలుకుతారు. కాని ఈ జినీవా ఒప్పందం వచ్చిన తరువాత మెతనోలుని జాగ్రత్తగా మెతనోలు అనే పలకాలి కాని మెతనాలు అనకూడదు. ఎందుకంటే జినీవా ఒప్పందం ప్రకారం మతనాలు అనే పదార్థం ఆల్కహాలు కాదు; అది మరొక జాతిథి. ఆ జాతి పేరు ఆల్డిహైడ్. మెతనాలు ఆల్డిహైడ్ జాతిథి, మెతనోలు ఆల్కహాలు జాతిథి. హైడ్రాక్సిల్ గుంపు ఉన్నవన్నీ ఆల్కహాలు జాతివి.
 
ఈ మెతల్ ఆల్కహాలు (మెతనోలు) రసాయన పరిశ్రమలలో చాల ముఖ్యమైన ముడి పదార్థం. రెండు రసాయన పదార్థాలు సంయోగం చెందాలంటే వాటిని పక్క పక్కలని పెట్టినంత మాత్రాన సరిపోదు; వాటిని బాగా దగ్గరగా తీసుకు రావాలి. అంటే రెండింటిని బాగా కలిసేలా ప్రోత్సహించాలి. ఉప్పుని, పంచదారని బాగా కలపాలంటే వాటిని ఏ అమాందస్తాలోనో వేసి దంచవచ్చు. కాని ఇంకా బాగా కలియాలంటే, రెండింటిని నీళ్లల్లో కరిగించి, అప్పుడు ఆ రెండింటిని కలిపితే బాగా కలుస్తాయి కదా. చాల పదార్థాలు నీళ్లల్లో కరుగుతాయి. కాని నీళ్లల్లో కరగనివి ఎన్నో మెతల్ ఆల్కహాలులో కరుగుతాయి. అప్పుడు వాటిని మెతల్ ఆల్కహాలులో కరిగించి, అప్పుడు ఆ రెండింటిని కలుపుతారు. పని అయిపోయిన తరువాత వేడి చేస్తారు. మెతల్ ఆల్కహాలు తేలికగా, 65 డిగ్రీల దగ్గరే, మరిగిపోతుంది కనుక దానిని వెలికి తీసి తిరిగి వాడుకోడానికి పెద్దగా ఖర్చు అవదు.
 
మెతనోలు రుచికి కొద్దిగా తీపిగా ఉన్నా ఇది ఒక విష పదార్థం. తెలిసో, తెలియకో దీనిని తాగడం కాని చేస్తే ఇది శరీరంలోకి వెళ్లి “ఫార్మిక్ ఆమ్లం”గా మారినప్పుడు దానిని మన నాడీతంతువులు తట్టుకోలేవు. ప్రత్యేకించి కంటికి సంబంధించిన నాడీతంతువులు త్వరగా దెబ్బ తింటాయి; అప్పుడు కళ్ళు పోతాయి. కల్తీ సారా తాగి కళ్లు పోగొట్టుకున్నవారి కథలు తరచు వార్తా పత్రికలలో వస్తూనే ఉంటాయి.
 
==మూలాలు==
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, ఇ-పుస్తకం, కినిగె,
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[ఆల్కహాల్]]
 
===ఎతల్ ఆల్కహాలు===
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు