భరత్ అనే నేను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==కథ==
చిన్నతనం లో అతను వైద్య సలహాకి వ్యతిరేకంగా ఐస్ క్రీం తింటాడు.అతని తల్లి అతన్ని తిడుతుంది .అతను ఆమెకు  మళ్ళీ తినను  అని  వాగ్దానం చేస్తాడు.భరత్  మళ్ళీ ఐస్ క్రీమ్ తినడం చుసిన తరువాత , అతని తల్లి వాగ్దానాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది
 
భరత్‌ రామ్‌(మహేష్‌ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్‌ కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్‌ రాజ్‌) భరత్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్‌ తన వాగ్దానాలను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే మిగిలిన కథ.
"https://te.wikipedia.org/wiki/భరత్_అనే_నేను" నుండి వెలికితీశారు