జీవితం (1949 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''జీవితం''' [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు 1949 లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో [[ఎం.వి.రామన్]] దర్శకత్వంలో నిర్మించిన మొదటి చిత్రం. ప్రముఖ నటి [[వైజయంతిమాల]]కు ఇది తొలి తెలుగు చిత్రం.
==సంక్షిప్త చిత్రకథ==
మద్రాస్‌లోని పేరు మోసిన వ్యక్తి శివశంకర లింగేశ్వర ప్రసాద్ (సిఎస్‌ఆర్). అతని కుమార్తె మోహిని (వైజయంతిమాల) విద్యావతి, నృత్యకళాకారిణి అయిన అందమైన యువతి. శివశంకర్ రెండో భార్య దుర్గమ్మ (అన్నపూర్ణ) తమ్ముడు మూర్తి (సిహెచ్ నారాయణరావు) మోహినిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోహినీ అందుకు అంగీకరించదు. అశోక్ అనే రచయితను ఇష్టపడుతుంది. ఆ రచయిత, బ్యాంక్ ఉద్యోగి అయిన నారాయణపతి (టిఆర్ రామచంద్రన్) పక్కింట్లో ఉంటుంటాడు. అతనే అశోక్ అని తెలియకపోయినా, వారిరువురూ ఒకరినొకరు ఇష్టపడడం, వివాహం చేసుకోవాలనుకుంటారు. మూర్తి పనిమీద పల్లెటూరికి వెళ్తాడు. ఆ వూరిలో పేద, అమాయక యువతి వరలక్ష్మి (ఎస్.వరలక్ష్మి). వడ్డీ వ్యాపారి బసవయ్య (కంచి నరసింహారావు) వృద్ధుడు. ఆమెను తండ్రి బాకీల నిమిత్తం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మూర్తి ఆ బాకీలు తీరుస్తానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తాడు. ఫలితంగా గర్భవతియైన వరలక్ష్మి మూర్తిని వెతుకుతూ మద్రాస్ వెళ్తుంది. ఆసుపత్రిలో బాబును ప్రసవించి మూర్తిని కలుసుకున్న ఆమెను ‘కులట’ అని నిందించి, మూర్తి తిరస్కరిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలని వరలక్ష్మి బాబును పతి కారులో విడిచివెళ్తుంది. ఈ బాబును చూసి, మూర్తి చెప్పుడు మాటలవల్ల పతికి, మోహినికి జరిగే పెళ్లి నిశ్చితార్థం ఆగిపోతుంది. జాలరులచే కాపాడబడిన వరలక్ష్మి తిరిగి బాబుకోసం వచ్చి, పతివద్ద చూసి, దూరంగా బతుకుతుంటుంది. మోహినికి, మూర్తికి పెళ్లి నిశ్చయం కావటం, బాబుకు ప్రమాదంగా వుందని చూడాలని వెళ్లి మోహిని, అక్కడకు వచ్చిన వరలక్ష్మి, మూర్తిలను గురించి నిజం తెలుసుకోవటం, మూర్తిని, పతి దెబ్బలనుంచి కాపాడబోయిన వరలక్ష్మి తీవ్రంగా గాయపడటం, ఈ సంఘటనతో మూర్తిలో మార్పువచ్చి వరలక్ష్మిని, బిడ్డను స్వీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్@50 జీవితం |url=http://www.andhrabhoomi.net/content/flashback50-57 |accessdate=17 May 2019 |work=ఆంధ్రప్రభఆంధ్రభూమి దినపత్రిక |date=4 May 2019}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జీవితం_(1949_సినిమా)" నుండి వెలికితీశారు