"సింహబలుడు" కూర్పుల మధ్య తేడాలు

కథ చేర్చాను
(కథ చేర్చాను)
 
'''సింహబలుడు''' 1978, ఆగష్టు 11న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నందమూరి తారక రామారావు]], [[వాణిశ్రీ]] నాయికానాయకులుగా నటించగా, [[ఎం.ఎస్. విశ్వనాధన్]] సంగీతం అందించారు.<ref name='యన్.టి.ఆర్ ‘సింహబలుడు"తో చెతుర్లు కాదు'>{{cite web|last1=ఇట్స్ ఓకే|title=యన్.టి.ఆర్ ‘సింహబలుడు"తో చెతుర్లు కాదు|url=http://www.itzok.in/2011/06/blog-post_27.html|website=www.itzok.in|accessdate=26 July 2017}}</ref> ఇందులో [[రావు గోపాలరావు]] నియంతగా నటించాడు.<ref name="ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18">{{cite web|last1=తెలుగు గ్రేట్ ఆంధ్ర|title=ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-jaanapada-chitraalu-18-65793.html|website=telugu.greatandhra.com|accessdate=10 August 2017}}</ref>
 
== కథ ==
రాజుగా పిలువబడే రాజేంద్రుడు రాజుల దురాగతాలను, అన్యాయాలను సహించడు. రఘునాథరాయలు వంశపారంపర్యంగా మహారాజు గారి దగ్గర పనిచేస్తుంటాడు. పదవీవిరమణ సమయంలో అతని మంచితనాన్ని గుర్తించి అతనిని ముఖ్య న్యాయాధిపతిగా నియమిస్తారు. అతని స్థానంలో గజపతివర్మను సేనాపతిగా నియమిస్తాడు. గజపతివర్మ రాజును మోసంచేస్తూ దురాగతాలు చేస్తుంటాడు. యువరాణి వాణి మారువేషముతో కోటనుండి బయటకు వస్తుంది. గాజును అతను చేసే మంచిపనులను గుర్తించి ప్రేమిస్తుంది. రాజుగారు నిర్ణయించిన పోటీలలో రాజు, గజపతివర్మను ఓడించి, సింహబలుడుగా బిరుదు పొందుతాడు. ఆ సమయంలో రఘునాథరాయలు చిన్నప్పుడు ఇంటినుండి వెళ్ళిపోయిన రాజేంద్రే, రాజు అని గుర్తిస్తాడు. గజపతి, రాజుమీద కోపంతో అతనితో కలిసి ఉంటున్న చెల్లిని, తాతను చంపి ఇంటికి నిప్పుపెడతాడు. ఆ సమయంలోనే వాణియే యువరాణి అని తెలుసుకుంటాడు. రాజును బంధించి బానిసగా నిర్భందిస్తారు. యువరాణి సహాయంతో తప్పించుకుని, మిగతా బానిసలను కూడా తప్పిస్తాడు. వారందితో కలిసి గజపతిని మట్టుపెట్టి, రాజు కళ్లు తెరిపించి యువరాణిని వివాహమాడతాడు.
 
== మూలాలు ==
2,877

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659575" నుండి వెలికితీశారు