స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింల పాత్ర :
 
[[బ్రిటీష్‌]] బానిస బంధనాల నుండి విముక్తిని కోరుకుంటూ సాగిన స్వాతంత్య్రోద్యమంలో భిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం, అంతర్గత మార్గదర్శక సూత్రంగా సాగుతున్న భారతీయ సాంఘిక జనసముదాయాలలో ఒకటైన [[ముస్లిం]] జనసముదాయం మాతృభూమి పట్లగల అవ్యాజ ప్రేమాభిమానాల ఫలితంగా ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి సోదర సమానులతో కలసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించింది స్వదేశీయుల పాలన సాధించుకోవడంలో మహత్తర పాత్ర నిర్వహించారు. ఈ మేరకు ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన మహత్తర పాత్రకు అంతర్గత, బహిర్గత కారణాలు, జాతీయ స్థాయి పరిణామాల మూలంగా చరిత్రలో లభించాల్సినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రచారం లభించలేదు. ఆ కారణంగా ఆనాటి అపూర్వ ఆత్మార్పణలు, త్యాగాలు చరిత్ర గర్భాన మరుగున పడిపోయాయి. [[ఆంధ్ర ప్రదేశ్‌]]లో తొలిసారిగా 1780లో విశాఖపట్నంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో జరిగినకంపెనీ సైన్యంలో సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్‌ అహమ్మద్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా స్వదేశీసైనికుల కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి తట్టుకోలేక కంపెనీ సైన్యాధికారులు కాళ్ళకు బుద్ధి చెప్పగా, స్థావరంలోని కోశాగారంలోని ధన సంపదను, ఆయుధాగారంలోని ఆయుధాలను సుబేదార్‌ అహమ్మద్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అంగ్లేయుల తొత్తులుగా మారిన జమీందార్ల కారణంగా, షేక్‌ సుబేదార్‌ అహమ్మద్‌తోపాటుగా తిరుగుబాటు యోధుల మరణశిక్షలకు ఎరయ్యారు. స్వజనుల విూద బ్రిటీషర్ల పెత్తనాన్ని సహించలేక, ఆంగ్లేయాధికారుల చర్యలను వ్యతిరేకించిన తొలినాటి ప్రముఖులలో నూరుల్‌ ఉమ్రా బహుదూర్‌ నైజాం దర్బార్‌లో అతి ముఖ్యులు. [[ఈస్ట్‌ ఇండియా]] కంపెనీలోని స్వదేశీ సైనికులను బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించమంటూ 1806 ప్రాంతంలో నూరుల్‌ ఉమ్రా ప్రోత్సహించిన కారణంగా దర్బారు నుండి బహిష్కరణకు గురైన ఆయన ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఔసా కోటలో 1818లో కన్నుమూశారు. నూరుల్‌ ఉమ్రా తరువాత నిజాం నవాబు సికిందర్‌ ఝూ బహుదూర్‌ కుమారుడు, అప్పటి నైజాం నవాబు నాసిరుద్దౌలా సోదరుడు అయినటువంటి ముబారిజుద్దౌలా ఆంగ్లేయుల పెత్తనాన్ని వ్యతిరేకించి ఆత్మాభిమానంగల స్వదేశీ సంస్థానాధీశులు, నవాబులతో కలసి పోరాటానికి సిద్దమైనందున ఆంగ్లేయుల ఆగ్రహానికి గురై గోల్కొండ కోటలో శిక్షను అనుభవిస్తూ 1854 జూన్‌ 25న కన్నుమూశారు. ఈ పోరాటం కోసం భారీ ఎత్తున ఆయుధాలను తయారు చేస్తూ పట్టుబడిన కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ జీవితం తిరుచునాపల్లి జైలులో 1840 జూలై 12న ముగిసింది. ఉత్తరాదిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభం కాకముందే ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలలో ఆత్మాభిమానం గల యోధులు, బ్రిటీష్‌ అధికారుల ఆజ్ఞలను ఖాతరు చేయకుండా తిరుగుబాటు పతాకాలను ఎగుర వేసిన యోధుల ప్రభావం నిజాం సంస్థానంలో కూడా ఆ ప్రభావం స్పష్టంగా బలపడసాగింది. ఈ పోకడలు ఎంతవరకు విస్తరించాయంటే పోరుబాట నడవండి మేం విూ వెంట ఉంటా అంటూ సంస్థానాధీశుడికి ప్రజానీకం నేరుగా సలహా ఇచ్చేంత స్థాయిలో బ్రిటీష్‌ వ్యతిరేకత [[నైజాం]] సంస్థానంలో ఉనికిని సంతరించుకుని ఊపందుకుంది. ఈ వాతావరణం మరింతగా ప్రబలి తెల్లవార్ని తరిమి కొట్టమని, మట్టుబెట్టమని నినాదాలు ఉద్భవించాయి.
 
==1857 కాలం ==
పంక్తి 77:
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం]]
[[వర్గం:ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర లోప్రదేశ్ ముస్లింలు]]