ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా శైలికి అనుగుణంగా మార్పు చేసాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 3:
'''ఆస్తానయె షామీరియా''' [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే '''షామీరియా దర్గా''' అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా బుగ్గవంక ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. ఇతని పూర్వీకులు పూర్వపు [[రష్యా]] (USSR) కు చెందిన బుఖారా (ప్రస్తుతము [[ఉజ్బెకిస్తాన్]]లో ఉంది) ప్రాంతానికి చెందినవారు. వీరు [[ఆఫ్ఘానిస్తాన్]] మీదుగా [[భారతదేశం]]లోనికి ప్రవేశించారు. ఇప్పటి [[పాకిస్తాన్]] కు చెందిన వుఛ్ ప్రాంతం నుంచి [[గుల్బర్గా]]కు అటు నుంచి కడపకు వచ్చారు.కమాలుద్దీన్ బాద్ షాహ్ బాల్యం వుఛ్ లో గడిచింది. అప్పటి ఒక సంఘటన - కమాలుద్దీన్ మసీదులో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక శవాన్నుంచుకుని పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. కమాలుద్దీన్ ఆ శవాన్ని చూశాడు. 'ఖూమ్ బి ఇజ్ నిల్లాహ్ ' అన్నాడు. 'దేవుని ఆజ్ఞతో లెమ్ము ' అని ఆ వాక్యానికి అర్థం. శవానికి ప్రాణం వచ్చింది. ఆ తర్వాత అతని తండ్రి కొడుకును వారించాడు: "ఇలాంటి మహిమ గల వాక్కులు పలుకవద్దని". తండ్రి కొడుకులు ఇద్దరూ గుల్బర్గా వచ్చారు. కమాలుద్దీన్ బాద్షాహ్ గుల్బర్గా నుంచి కడపకు వచ్చాడు. వీరిని గుల్బర్గా ఖాజా [[బందా నవాజ్]] వంశీకులు అంటారు. తాను నిర్మించుకున్న దర్గాకు తానే పీఠాధిపతి కమాలుద్దీన్ బాద్ షాహ్.అతని వంశం వారే ఆ దర్గాకు పీఠాధిపతులు అవుతున్నారు.
 
దర్గా పక్కనే మసీదు ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త [[మసీదు]] నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (క్రీ.శ.1810)లో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరుగాను, [[మద్రాసు]] గవర్నరుగాను పని చేసిన [[మన్రో]] దొర ఈ మసీదు నిర్మాణానికి ఇనాములు ఇవ్వజూపాడు. పీఠాధిపతి హుసేనీ స్వీకరించలేదు. దర్గా పక్కనే ఉన్న దీవాన్ సాహెబ్ అనే ఫకీరు చెయ్యి చాపాడు. ఆయనకు నెలకు 4 రూ,లు భృతి మన్రో దొర ఏర్పాటు చేశాడు. ఆ భృతి వంశపారంపర్యంగా నడచింది. దర్గాలో పూర్వ పీఠాధిపతులు ముగ్గురు మహనీయుల సమాధులున్నాయి. ఆ మహనీయులు సయ్యద్ మహమ్మద్ హుస్సేనీ, ఖాదిర్ బాద్ షాహ్ అబ్ద్, అబ్దుల్ హఖ్ అలియాస్ షామీర్ బాద్ షాహ్ (ఇతని పేరు మీదే ఇక్కడ ఉరుసు జరుగుతుంది).
 
ప్రతి సంవత్సరం [[రంజాన్]] ముందటి [[షాబాన్]] మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. [[కవిత్వం]] చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, [[వైద్యశాల]]<nowiki/>ను, ఉచిత [[ప్రసూతిశాస్త్రం|ప్రసూతి]] చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వామే ఇతని ఆశయం.
 
 
==మూలాలు, వనరులు==
Line 12 ⟶ 11:
 
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర లోప్రదేశ్ దర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు