ఇంగ్మార్ బెర్గ్మాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''ఇంగ్మార్ బెర్గ్మాన్'''; {{Lang|sv|Ernst Ingmar Bergman}} (14 జూలై 1918 - 30 జూలై 2007) ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. ఇతని సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి.ఎందరినో ప్రభావితం చేశాయి. దాదాపు 60 సినిమాలు మరియు టెలివిజన్ డాక్యుమెంటరీలకి దర్శకత్వం వహించాడు<ref>{{cite news |first= Mervyn|last= Rothstein|authorlink= |coauthors= |title=Ingmar Bergman, Famed Director, Dies at 89 |url=http://www.nytimes.com/2007/07/30/movies/30cnd-bergman.html |quote=Ingmar Bergman, the ‘poet with the camera’ who is considered one of the greatest directors in motion picture history, died today on the small island of Faro where he lived on the Baltic coast of Sweden, Astrid Soderbergh Widding, president of The Ingmar Bergman Foundation, said. Bergman was 89. |work=New York Times |date=30 July 2007 |accessdate=31 July 2007 }}</ref>. అతని ప్రసిధ్ధి చెందిన సినిమాలు. The Seventh Seal (1957), Wild Strawberries (1957), Persona (1966), Cries and Whispers (1972), and Fanny and Alexander (1982). ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్‌మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్. మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.
 
పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్‌మన్... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్ వాన్ సిడో, గన్నెల్ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్ తులిన్, లివ్ ఉల్‌మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్ ఆండర్సన్, స్వెన్ నైక్విస్ట్ (కెమెరామన్)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి తల్లిలాంటి ఆదరణతో టీ, లంచ్ సర్వ్ చేయడానికి ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్ కంట్రోల్ ఉంటుందని ఆయన ఉద్దేశం!