ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
[[2003]]లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. [[గుణశేఖర్]] దర్శకత్వంలో విడుదల అయిన [[ఒక్కడు]] చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. [[భూమిక]] కథానాయికగా, [[ప్రకాష్ రాజ్]] ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన [[నిజం]] చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు [[నంది పురస్కారం|నంది పురస్కారాన్ని]] అందుకున్నాడు. [[2004]]లో తమిళనాట విజయవంతమైన '''న్యూ''' చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో [[నాని]]గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన [[అర్జున్]] పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.[https://readme5minutes.com/2019/02/mahesh-babu-whatsapp-number-height-weight-bio/ మహేష్] తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.
 
అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. [[అతడు]] చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. [[2005]]లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంనందినంది పురష్కారం లభించింది. [[2006]]లో మహేష్ నటించిన చిత్రం [[పోకిరి]] విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న [[అమితాబ్ బచ్చన్]], [[రాంగోపాల్ వర్మ]] తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు<ref name="Amitabh wonderstruck by Pokiri ">{{cite web| title= indiainfo.com| work= Amitabh wonderstruck by Pokiri |url= http://movies.indiainfo.com/southern-spice/telugu/pokiri-300606.html|accessdate=4 February|accessyear=2007}}</ref> . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.
 
పోకిరీ తరువాత నిర్మాణమయిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన '[[దూకుడు]]' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో చేస్తున్నారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఆ తరువాతి చిత్రం సుకుమార్ గారి దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం.