అడవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
కోనిఫెరస్ అడవులు (Coniferous Forests) శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. ఎక్కువ వర్షపాతం, పటిష్ఠమైన రుతు శీతోష్ణస్థితులు, చాలాకాలం కొనసాగే అతి శీతాకాలం, కొద్దికాలం ఉండే వేసవికాలం, ఈ అడవులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఖండాలను కలుపుతూ వరుసగా పెరుగుతాయి. ఉత్తర అమెరికా, యూరేసియా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్, సైబీరియా దేశాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. సతతహరిత వృక్ష జాతులైన పైన్, స్ప్రూస్, ఫర్ మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి. చెవుల పిల్లులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, ఉడతలు, హైలా, రాఅనా, అనేక జాతుల పక్షులు, పెద్ద శరీరంతో ఉండే సకశేరుకాలు మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మృత్తిక పలుచగా హ్యూమస్ రహితంగా ఉంటుంది. మట్టి సారవంతమై ఉండదు. కోనిఫెర్ ల గింజలు జంతువులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.
 
=== ఆకురాల్చేఆక్కూరలిచ్చే సమశీతోష్ణ అడవులు ===
ఆకురాల్చేఆక్కూరలిచ్చే సమశీతోష్ణ అడవులు (Tropical Deciduous Forests) శీతోష్ణస్థితి సమంగా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ చెట్లు వెడల్పు ఆకులతో ఉంటూ, వర్షాకాలంలో ఆకులు రాల్చి, చలికాలంలో పత్రరహితంగా ఉండి, వసంతకాలంలో తిరిగి చిగుర్చుతాయి. ఇవి ఉత్తర అమెరికా, ఐరోపా, తూర్పు ఆసియా, చిలీ, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన దేశాలలో ఉన్నాయి. అతి శీతలంగా ఉండే చలికాలం, సంవత్సరానికి 80-180 సెం.మీ. వర్షపాతం, 10-20 డిగ్రీల వేడిమి ఈ అడవుల ముఖ్య లక్షణాలు. చెట్లు 40-50 మీ. ఎత్తు పెరుగుతాయి. ఓక్, బీచ్, కాడన్ ఉడ్, ఎల్మ్ వంటి పెద్ద వృక్షాలు ఉంటాయి. నాచులు, శైవలాలు, లైకేన్లు వృక్ష కాండాలమీద పెరుగుతాయి. జింకలు, ఎలుగుబంట్లు, ఉడతలు, నక్కలు, వడ్రంగి పిట్టలు, తాబేళ్లు, బల్లులు, పాములు ముఖ్యమైనవి. క్షీరదాలలో పందులు, పర్వత సింహాలు ఉంటాయి.
 
=== సతతహరిత సమశీతోష్ణ అడవులు ===
"https://te.wikipedia.org/wiki/అడవి" నుండి వెలికితీశారు