రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
[[దస్త్రం:Portrait of Rajaraja Narendrudu.JPG|thumbnail|రాజరాజ నరేంద్రుడి చిత్రపటం]]
[[File:Chalukya vaibhavam.jpg|thumb|రాజమండ్రి నగర సాంస్కృతిక, చారిత్రిక ప్రాధాన్యతను వివరిస్తూ నగర రైల్వేస్టేషన్లో వేసిన [[కుడ్యచిత్రాలు|కుడ్యచిత్రం]]]]
రాజమహేంద్రిని [[రాజరాజ నరేంద్రుడు]] రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమహేంద్రిని పరిపాలించారని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో [[కవిత్రయం]]లో మెదటివారైన [[నన్నయ్య]] శ్రీ మహాభారతాన్ని తెనుగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత [[విజయాదిత్యుడు]] (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. [[కాకతీయులు|కాకతీయ]] సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. 1326లో ముసునూరి ప్రొలానీడు తీరాంధ్రమును తురుష్కులనుండి విముక్తము చేశాడు. దీనితో రాజమహేంద్రవరము తిరిగి  స్వతంత్రమైనది (A Forgotten Chapter of Andhra History: History of the Musunuri Nayaks) by Mallampalli Somasekhara Sarma పేజీ.14). ఆ తరువాత రెడ్డి రాజులు, కపిలేశ్వర గజపతి, [[బహమనీ సుల్తానులు]], పురుషోత్తమ గజపతి, [[శ్రీకృష్ణదేవరాయలు]], [[ప్రతాపరుద్ర గజపతి]] వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు.
[[File:Rajahmundry Rly.Stn..JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు